Wednesday, April 24, 2024

వీ హీరో అన్‌ లిమిటెడ్.. ప్రతీ నెల 2 జీబీలు అదనం..

న్యూఢిల్లి : తమ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేని డేటా అనుభవాలను అందిస్తామనే భరోసా అందిస్తూ.. సుప్రసిద్ధ టెలికామ్‌ సేవల ప్రదాత వి తమవి హీరో అన్‌లిమిటెడ్‌ ప్రచారాన్ని మరో వినూత్నమైన ప్రతిపాదన డేటా డిలైట్‌తో ప్రారంభించింది. దీంతో వి వినియోగదారులు ప్రతీ నెల 2 జీబీ డేటాను అదనంగా తమ రోజువారీ కోటాకు మించి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందొచ్చు. అపరిమిత డేటా అనుభవాలను వినియోగదారులకు అందిస్తూ.. వి హీరో లిమిటెడ్‌ పోర్ట్‌ ఫోలియోలో వినూత్నమైన ప్రయోజనాలైన అపరిమిత హై స్పీడ్‌ డేటాను అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు పొందడంతో పాటు వీకెండ్‌ డేటా రోలోవర్‌ను పొందొచ్చు.

మరింతగా తమ హీరో అన్‌లిమిటెడ్‌ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తూ.. వీ ఇప్పుడు మరిన్ని రీచార్జ్‌ ప్యాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలో విడుదల చేయనుంది. వి హీరో అన్‌లిమిటెడ్‌ ప్రయోజనాలను వినియోగదారులు పొందేందుకు తమ మొబైల్‌ నుంచి 121249కు డయల్‌ చేయడంతో పాటు వి యాప్‌ ద్వారా కూడా పొందొచ్చు. వి హీరో అన్‌లిమిటెడ్‌ ప్యాక్‌లు రూ.299, ఆ పైన రీచార్జి డెయిలీ డేటా కోటా ప్యాక్‌లతో లభిస్తాయి. వి ఇప్పటికే నూతన రీచార్జీ ప్యాక్‌లను రోజువారీ డేటా కోటాతో రూ.359, రూ.409, రూ.475 ప్యాక్‌లో హీరో అన్‌ లిమిటెడ్‌ పోర్ట్‌ఫోలియో కింద జోడించొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement