Sunday, December 8, 2024

సరికొత్త వెూటో జీ82 5జీ స్మార్ట్‌ ఫోన్‌ని లాంచ్‌ చేసిన వెూటోరోలా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అద్భుతమైన బిలియన్‌ కలర్‌, 120 హెచ్‌ జెడ్‌ పి ఓఎల్‌ ఈడీ డిస్‌ ప్లే, ఓఐఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో 50 మెగాపిక్సెల్‌ కెమెరా లాంటి సూపర్‌ ఫీచర్స్‌ ఉన్న సరికొత్త మోటో జీ82 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ని మోటోరోలా లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.19999లకే వినియోగదారులకు అందుబాటు లో ఉంది. ఫ్లాగ్‌షిప్ గ్రేడ్‌ బిలియన్‌ కలర్‌, 120 హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 10-బిట్‌ ఓఎల్‌ ఈడీ డిస్‌ప్లేతో వస్తోన్న మోటో జీ82 5జీ నిజంగా అద్భుతమైనది.

ఈ మోటో జీ82 స్మార్ట్‌ ఫోన్‌… మొదటి 50 మెగా పిక్సెల్‌ కెమెరాను ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఓఐఎస్‌), డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. అంతేకాకుండా 33 వాట్స్‌ టర్బో పవర్‌చార్జర్‌, భారీ 5000ఎమ్‌ ఏహెచ్‌ బ్యాటరీతో పవర్‌ బ్యాకప్‌ అద్భుతంగా ఉంటుంది. అన్నింటికి మించి ఇది ఎంతో తేలికైన డిజైన్‌ అని ఆసంస్థ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement