Thursday, March 28, 2024

స్టైలిష్‌ అండ్‌ ట్రెండీ స్మార్ట్‌ఫోన్‌.. వై16ను లాంచ్‌ చేసిన వివో

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో వై16 లాంచ్‌తో భారతదేశంలో తన వై సిరీస్‌ పోర్ట్‌ ఫోలియోను విస్తరించింది. 3జీబీ ప్లస్‌ 32జీబీకి రూ.9999, 4జీబీ ప్లస్‌ 64 జీబీకి రూ.12,499గా ఉన్న వై16 స్మార్ట్‌ఫోన్‌ రెండు కళ్లు చెదిరే రంగుల్లో లభ్యం కానుంది. వివో ఇండియా ఈ స్టోర్‌ అండ్‌ అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేసేందుకు ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

అలాగే అన్ని రిటైల్‌ స్టోర్లలో కొటక్‌, ఐటీఎఫ్‌సీ, వన్‌ కార్డ్‌, బీఓబీ, పెడెరల్‌, ఏయూ బ్యాంక్‌ కార్డులను ఉపయోగించి వినియోగదారులు రూ.వెయ్యి వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆన్‌లైన్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.750లు క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. వై 16 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియాటెక్‌ పీ35 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement