Friday, March 29, 2024

నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ గ్రీన్‌సిగ్నల్

భారత్‌‌లోని బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి ఇంగ్లండ్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా యూకేలోని న్యాయస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

గత ఫిబ్రవరి 25న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. ముంబైలోని అర్థర్ రోడ్డు జైలులో బ్యారక్‌ను సిద్ధం చేసింది. నీరవ్ మోదీని ముంబై తీసుకొచ్చిన వెంటనే అర్థర్ రోడ్ జైలులోని 12 నంబర్ బ్యారక్‌లో ఉంచుతామని జైలు అధికారి తెలిపారు. ఈ బ్యారక్‌కు సెక్యూరిటీ అత్యంత పటిష్టంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement