Monday, November 11, 2024

HYD: అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసిన ఉజ్జీవన్ బ్యాంక్..

హైదరాబాద్ : దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ మహోన్నతమైన బతుకమ్మ సంస్కృతికి నివాళులర్పిస్తూ హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్‌లో తెలంగాణాలోనే అతిపెద్ద ఇండోర్ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్ బ్యాంక్.

దాదాపు పద్నాలుగున్నర అడుగుల ఎత్తైన ఈ బతుకమ్మను అక్టోబర్ 5- 6 తేదీల్లో ప్రదర్శనకు ఉంచామని, ఈ పుష్ప ప్రదర్శన ద్వారా ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, సామాజిక స్ఫూర్తిని బ్యాంక్ గౌరవిస్తుందని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్‌లతో సహా ఇంటరాక్టివ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్‌లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement