Friday, October 4, 2024

HYD: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రెండు అరుదైన సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్సలు విజయవంతం…

హైద‌రాబాద్: అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలకు సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ విజయవంతంగా చికిత్స చేసింది. ప్రసూతి అండ్ గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ జ్యోతి కంకణాల నేతృత్వంలో రోగికి లాపరోస్కోపిక్ స్కార్ ఎక్టోపిక్ ఎక్సిషన్ చికిత్స చేశారు. సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ గర్భాలు చాలా అరుదు, మొత్తం ఎక్టోపిక్ గర్భాలలో 1శాతం కంటే తక్కువ మందిలో ఇవి సంభవిస్తాయని డాక్టర్ కంకణాల చెప్పారు.

ఈ తరహా సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే, గర్భాశయ చీలిక, అధిక రక్తస్రావం, అరుదైన సందర్భాల్లో, హిస్టెక్టమి (మ‌హిళ‌ గర్భాశయాన్ని తొలగించే శస్త్ర‌చికిత్స) అవసరమవుతుందన్నారు. అదృష్టవశాత్తూ, లాపరోస్కోపిక్ శస్త్ర‌చికిత్స ద్వారా ఎక్టోపిక్ కణజాలాన్ని తొలగించి, గర్భాశయ లోపం సరిచేయడం జరిగిందని, భవిష్యత్తులో రోగికి పిల్లలు పుట్టే అవకాశాలను సైతం కాపాడామన్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా ఎక్టోపిక్ కణజాలాన్ని తొలగించినప్పటికీ, సమస్య పునరావృతం కాకుండా లేదా ఇతర సమస్యల బారిన పడకుండా నిరంతర పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను డాక్టర్ కంకణాల నొక్కి చెప్పారు.

- Advertisement -

సిటిఎస్ఐ – దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది, ఈ తరహా సందర్భాలలో సకాలంలో రోగ నిర్ధారణ, అధునాతన శస్త్ర‌చికిత్స జోక్యాల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ సి ఓ ఓ డాక్టర్ ప్రభాకర్ పి.మాట్లాడుతూ…. ఈ కేసు త‌మ వైద్య బృందం అసాధారణ నైపుణ్యాన్ని, తాము ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను వెల్లడిస్తుందన్నారు. సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సంక్లిష్ట కేసులను నిర్వహించడానికి లాపరోస్కోపిక్ విధానాలు కీలకంగా మారుతున్నాయన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతలు, ఈ తరహా క్లిష్టమైన పరిస్థితులను ఖచ్చితత్వంతో, జాగ్రత్తతో పరిష్కరించడానికి త‌మకు అనుమతిస్తాయన్నారు. త‌మ‌ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను నిర్ధారిస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement