Friday, October 4, 2024

HYD: యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్రను స‌త్క‌రించిన టొయోటా కిర్లోస్కర్ మోటార్

హైద‌రాబాద్ : ప్రతిష్టాత్మకమైన 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (టిడిసిఏసి) గ్లోబల్‌ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకరిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర ఎంపికైనందుకు, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఇటీవల సత్కరించింది. టొయోటా స్ మెమరీ కార్ పేరుతో ఆమె రూపొందించిన ఊహాత్మక సృష్టి, 90 దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన 712,845 ఎంట్రీల నుండి ఎంపికైన టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఆమెకు స్థానాన్ని సంపాదించింది. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, ఆమెకు యుఎస్ డి 3,000 బహుమతి లభించింది.

ఈసంద‌ర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… పేరూరి లక్ష్మీ సహస్ర వంటి యువతను చూడటం నిజంగా స్ఫూర్తిదాయకమ‌న్నారు. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ-ఇది మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానించబడిన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వాన‌మ‌న్నారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయానికి తాము గర్విస్తున్నామన్నారు.

పేరూరి లక్ష్మీ సహస్ర గ్లోబల్ మాట్లాడుతూ… తాను టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా గుర్తించబడినందుకు చాలా సంతోషిస్తున్నానన్నారు. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించానన్నారు. త‌న కలల కారు, టొయోటా మెమరీ కార్, సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, వ్యక్తులను అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో ప్రేరణ పొందిందన్నారు. త‌మ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి నాలాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement