Friday, March 29, 2024

ఏఐతో ఉద్యోగాలకు ముంప్పు.. మైక్రోసాఫ్ట్‌ నివేదిక వెల్లడి

కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మరుతుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదని కొంతమంది నిపుణులు భరోసా ఇస్తున్నప్పటికీ, ఎక్కువ మంది టెక్‌ నిపుణులు దీన్ని నియంత్రించకుంటే ప్ర మాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏఐ తమన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందన్న ఆందోళనను భారత్‌లో 74 శాతం మంది ఉద్యోగులు వ్యక్తం చేశారని మైక్రోసాఫ్ట్‌ తన సర్వేలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ 2023 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది.

భారత్‌లో నాలుగింట మూడొంతుల మంది తమ పనిని సాధ్యమైనంత వరకు ఏఐకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 90 శాతం మంది భారతీయ కంపెనీల నిర్వాహకులు, ఏఐ వృద్ధికి తగ్గట్లుగా ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రియేటివిటీ తగ్గుతుందని నాలుగింట మూడొంతుల మంది (84శాతం) సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుక ప్రధాన కారణం సమావేశాలు సరిగ్గా జరగకపోవడమే.

- Advertisement -

తాము సగం సమావేశాలకు హాజరుకాకపోయినా సహచరులు గుర్తించలేకపోతున్నారని 46 శాతం మంది సిబ్బంది భావిస్తున్నారు. ఏఐ నిపుణులతో పాటు ప్రతి ఉద్యోగి తమ రోజువారీ పనుల్లో భాగంగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం తమ పనులు పూర్తి చేయడానికి తగిన సామర్ధ్యాలు తమకు లేవని భారతీయ సిబ్బంది అనుకుంటున్నారని నివేదిక తెలిపింది.

ఏఐతో సులభంగా పనులు…

ఏఐ వల్ల రోజువారీ పనుల్లో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సరికొత్త ఉత్పదాకత వృద్ధిదశకు తదుపరి తరం ఏఐను వినియోగించుకునే అవకాశం ఉంది. వీటి వల్ల పనుల్లో కఠినత్వం తొలగుతుంది. ఉస్లాసంగా, వినూత్నంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి సంస్థు ఉన్నతాధికారులు ఆ దిశగా ఏఐని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

ప్రతి ఉద్యోగి భివిష్యత్‌ అవసరాలకు కొత్త దారులు వేసేలా ఏఐని పరీక్షించి అందించాలని మైక్రోసాఫ్ట్‌ కంట్రీ హెడ్‌ భాస్కర్‌ బసు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. కృత్రిమ మేధ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు తీసుకు రావాలని చాలా మంది కోరుతున్నారు. దీన్ని సరైన దిశలో ఉపయోగించుకోకుంటే అనేక సమస్యలు వస్తాయని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement