Thursday, April 25, 2024

రెండో రోజూ నష్టాలే, ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో భారీ క్షీణత

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మాతో పాటు కన్జూమర్‌ గూడ్స్‌ స్టాక్‌లు మార్కెట్లను కిందికి లాగేశాయి. సోమవారం మాదిరిగానే.. ఆరంభంలో భారీ లాభాలు.. చివర్లో అంతే స్థాయిలో అమ్మకాలు.. వెల్లువెత్తాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 132 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్ల లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌.. 54,524 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,886 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి కాస్త కోలుకుని 236 పాయింట్లు నష్టపోయి.. 54,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే.. 89 పాయింట్ల నష్టంతో 16,125 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం కనిపించిన లాభాలను సూచీలు.. మార్కెట్లు ముగిసే సమయం నాటికి నిలబెట్టుకోలేకపోయాయి.

చివర్లో అమ్మకాల వెల్లువ..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చేసిన కామెంట్లు ఇన్వెస్టెటర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 0.65 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.26 శాతం క్షీణించాయి. సబ్‌ ఇండెక్స్‌లు నిఫ్టీ ఐటీ 1.88 శాతం, నిఫ్టీ ఫార్మా 1.53 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.30 శాతం మేర నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ టాప్‌ లూజర్‌గా నిలిచాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ (హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌), కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభాల్లో స్థిరపడ్డాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ తన బోర్డు డివిడెంట్‌ చెల్లింపును పరిశీలిస్తుందని చెప్పడంతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు 0.84 శాతం పెరిగి రూ.823.75 వద్ద ముగిశాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం 75.01 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో.. జొమాటో 13.95 శాతం పెరిగి.. రూ.64.95 వద్ద ముగిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement