Tuesday, March 26, 2024

రష్యా నుంచి తగ్గిన ముడి చమురు దిగుమతి.. రవాణా ఖర్చులు పెరగడమే కారణం

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు మన దేశం తగ్గించింది. ప్రధానంగా రవాణా వ్యయం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే రకం ముడి చమురును మద్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే బ్యారెల్‌కు 5-7 డాలర్ల వరకు తక్కువకు రావడంతే ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించడంతో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో రష్యా తక్కువ ధరకే ముడి చమురు ఇస్తామని మన దేశానికి ఆఫర్‌ ఇచ్చింది. అమెరికా వ్యతిరేకించినప్పటికీ మన దేశం రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లలోపుకి దిగి వచ్చాయి. దీం తో రష్యా నుంచి ముడి చమురు దిగుమతికి అవుతున్న రవాణా వ్యయం కూడా కలుపుకుంటే రేటు పెరుగుతోంది.

దూరం పెరగడంతోనే రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇదే చమురును మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు కూడా కలుపుకున్నా బ్యారెల్‌కు 5 నుంచి 7 డాలర్లు తక్కువ అవుతోంది. దీంతో రష్యా నుంచి దిగుమతులు తగ్గించిన మన దేశం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెంచింది. ఇప్పటి వరకు రష్యా నుంచి అత్యధికంగా చైనా ముడి చమురును దిగుమతి చేసకుంటోంది. చైనా తరువాత మన దేశం రెండో స్థానంలో ఉంది.

రష్యా నుంచి మన దేశం జూన్‌లో రికార్డ్‌ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంది. అప్పటి నుంచి క్రమంగా దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం రష్యా నుంచి 2మిలియన్‌ టన్నుల చమురుని దిగుమతి చేసుకుంది. ఆగస్టులో 3.55 మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకున్నాం. ఆఫ్రికా నుంచి ఆగస్టులో 1.16 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 2.35 మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకున్నాం.
రష్యా నుంచి రోజవారి దిగుమతులు 7,20,000 బ్యారెళ్లకు పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement