Saturday, November 2, 2024

Big Story: పేద‌ల‌కు ధరల మంట.. ఆకాశాన్నంటిన నిత్యావసరాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పెరుగుతున్న నిత్యావసరాల ధరలు పేదలు, సామాన్యులకు శాపంగా మారుతున్నాయి. నిరుపేదలు, సామాన్యుల జీవనం దినదినగండంగా మారుతోంది. దేశంలో, రాష్ట్రంలో నిత్యావసరాలు మొదలుకొని అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజెల్‌ ధరల పెరుగు దలతో అన్ని రకాల వస్తువులు, సేవలు, నిత్యావసరాలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరి, ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ధరల అదుపునకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం మెరుగైనదిగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు కేంద్ర వైఫల్యాలు, అనియంత్రిత ధోరణులతో పేదలు, సామాన్యుల జీవన వ్యయ ప్రమాణాల్లో ఘోరమైన మార్పులు సంతరించుకుంటున్నాయి.

వంటనూనెలు, కూర గాయలు, పప్పు దినుసులు, డైరీ, పాలు, పౌల్ట్రి, చికెన్‌, మటన్‌, పండ్లు, సర్వీసు లు, ఇంటి అద్దెలు మొదలుకొని గృహవినియోగ సేవలు, కం ప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల వంటి అన్ని రకాల ధరలు ఇప్పుడు పేదలకే కాకుంగా, మధ్యతరగతి, ఆపై తరగతి వర్గాలకు కూడా భారంగా మారాయి. ఈ ధరలు ఎంత ప్రియంగా మారాయంటే ఈ దశాబ్దంలోనే ఇంత ఎక్కు వ ధరలు పెరుగుతా యనే అంశాన్ని ఆర్థిక, వ్యాపార నిపు ణులు కూడా అంచనా వేయలేనంతగానని పేర్కొంటున్నారు.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే….

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్రో ఉత్పత్తుల ధరలు ఇష్టానుసారంగా పెరుగుతు న్నాయి. గతేడాది లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 నుంచి రూ.110కి పెరగ్గా, డీజెల్‌ లీటర్‌ రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడా యిల్‌ ధర 100 డాలర్లు దాటనుందనే అంచనాల నేపథ్యంలో ఈ ధరలు ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదు. ఈ పెరుగుదల ప్రభావం 60శాతం మంది జనాభాపై పడుతున్నది. పౌరుల ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. 80శాతం మంది జనాభాపై పొదుపు ప్రభావం నమోదవుతున్నది. ఇప్పటికే ఇతర ఖర్చులను తగ్గించుకుం టున్న ప్రజలు తప్పనిసరి ఖర్చులనే భరించేందుకు సిద్ధమవుతు న్నారు. అయితే విద్య, వైద్యంతోపాటు రవాణా ఖర్చుల్లో పెరుగుదల బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి.

సామాన్యులపై పెనుభారం…

- Advertisement -

రవాణా ఖర్చులు వ్యవసాయం, పాడిపరి శ్రమపై ఎక్కువగా ప్రభావం మోపడంతో సాగు ఖర్చులు పెరిగాయి. ఇదే సమ యంలో పాల ధరలు సామాన్యులకు ఇబ్బందిగా పరిణమించాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు 142శాతం పెరిగితే ఇదే సాకుగా పాల ధరలను 162శాతానికి పెంచారు. 2014 నుంచి 2022 నాటికి పెరుగుదల పెట్రో ఉత్పత్తుల సాకుతో పెరు గుతూ పోయింది. ఇక చికెన్‌ ధరలు 94శా తం, చేపలు, రొయ్యల ధరలు 56 శాతం, పాల ధర 39శాతం, నెయ్యిపై 37శాతం ఎరుగుదల నమోదైంది. ఇదే సమయంలో ఒక్కో వాహనంపై సగటు పెట్రోల్‌ ధర 31శాతం పెరిగింది. గోధుమలు, 27శాతం, బియ్యం ధర 21శాతం పెరుగుదల 2014 నుంచి 2022 వరకు పెరుగుతూ వచ్చింది.

ఇంటి అద్దెల భారం మరింత పైపైకి…

ఇంటి అద్దెల పెరుగుదల సొంత ఇండ్లు లేని వారికి శాపంగా పరిణమించింది. ఈ రంగంలో 165శాతం పెరుగుదల వృద్ధి చెందింది. హౌసింగ్‌ రంగంలో 71శాతం, మందులు 54శాతం, బస్సులు, లోకల్‌ రైళ్లు చార్జీలు 53శాతం, ట్యూషన్‌ ఫీజులు 50శాతం విద్యుత్‌పై 20శాతం పెరుగుదల పేదల నడ్డి విరిచాయి.

పెట్రోల్‌, డీజెల్‌ ధరల సాకుతో…

పెరుగుతున్న పెట్రోల్‌, డీజెల్‌ ధరలు సామాన్యుల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వారి పొదుపు మొత్తాలను హరించేస్తున్నాయి. 2014లో పెట్రోల్‌ ధరలను మించి వేగంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల సంపాదన మొత్తం వెచ్చాలకే ఖర్చువుతున్న పరిస్థితి నెలకొంది. 2012నాటి బేస్‌ ఏడాది ఆధారంగా సాధారణ వినియోగదారుల ప్రైస్‌ ఇండెక్స్‌లో భాగంగా 2014 జనవరి నుంచి 79శాతం లిస్టెడ్‌ వస్తుసేవల ధరలు అంటే దాదాపు 299 వస్తువుల ధరలు పెట్రోల్‌ ధరలకు మించి పెరిగాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ ముడిచమురు ధరల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. కానీ 2014నుంచి గమనిస్తే నిత్యావసరాల ధరలు దేశమంతటా అడ్డగోలుగా పెరగడం వెనుక పెట్రో ఉత్పత్తుల ధరలకంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణా లోపం, పన్నులు, సెస్సుల విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు.

కూరగాయల ధరలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్‌ వరకు రెక్కలు…

ప్రజలకు నిత్యం వినియోగించే కూరగాయల ధరలు కూడా ఆకాశంలోకి చేరాయి. ఉల్లిపాయల ధరలు 2014తో పోలిస్తే 67శాతం, వంకాయ 56శాతం, ఇతర కూరగాయాలు 50శా తం, పాలకూర 42శాతం, ఆలుగడ్డ 23శాతం అరటి 14శాతం, ఆపిల్‌ పండ్ల ధరలు 14శాతంగా పెరిగాయి. ప్రతి ఇంట్లో వినియోగించే వంట నూనెల ధరలు ప్రభుత్వాల పరిధిలో లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగి నిత్యావసరాల దిగుమ తుల్లో భారీ వ్యయాలు, ధరల నియంత్రణ లేకపోవడంతో వంట నూనెల ధరలు మరింత ప్రియంగా మారాయి. ఇవి 2014నుంచి 2022 నాటికి 205శాతం పెరగ్గా, మస్టర్డ్‌ అయిల్‌ 96శాతం, రిఫైండ్‌ ఆయిల్‌ 89శాతం, పల్లి నూనె 80శాతం పెరిగాయి. వినియోగదారుల వినియోగ వస్తువల ధరలు కూడా సహజంగానే పెరుగుడే మినహా ఏనాడు తగ్గడం లేదు. టీవీలు 57వాతం, వాషింగ్‌ మెషీన్లు 33శాతం, ఏసీలు 30శాతం, రిఫ్రిజిరేటర్లు 28శాతం, ల్యాప్‌టాప్‌లు 23శాతం, మొబైల్‌ ఫోన్లు 17శాతంగా ధరలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement