Friday, November 29, 2024

Maruti Suzuki | సేఫ్టీ రేటింగ్‌ 5 స్టార్‌… మారుతీ డిజైర్ ఘ‌న‌త !

మారుతీ సుజుకి త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న ఫోర్త్‌ జనరేషన్‌ డిజైర్‌ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ కారు 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌, పిల్లల భద్రత విషయంలో 4 స్టార్‌ పొందింది.

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే. మారుతీ సుజుకీ స్వచ్ఛందంగా ఈ కారును క్రాష్‌ టెస్ట్‌కు పంపించింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు 31.24 పాయింట్లు కొత్త డిజైర్‌ కారు సాధించింది. చిన్న పిల్లల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు 39 పాయింట్లు పొందింది.

- Advertisement -

మారుతీ నుంచి వచ్చిన ఏ కారును ఇంత వరకు 5 స్టార్‌ రేటింగ్‌ ఒక్క కారు కూడా సాధించలేదు. ఒకే ఒక్క కారు మాత్రం 4 స్టార్‌ రేటింగ్‌ పొందింది. అమ్మకాల్లో పాపులర్‌గా ఉన్న బాలినో వంటి కార్లకు కనీసం 2 స్టార్‌ రేటింగ్‌ కూడా లేదు. కంపెనీ చరిత్రలో మొదటిసారిగా మార్కెట్లోకి రానున్న కొత్త డిజైర్‌ ఈ ఘనత సాధించిన తొలికారుగా నిలిచింది.

దీని ప్రభావం అమ్మకాలపై ఉంటుందని కంపెనీ భావిస్తోంది. కొత్త డిజైర్‌ ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ పరంగా అనేక మార్పులతో వస్తోంది. కొత్త డిజైర్‌ కార బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. త్వరలోనే కారు ధర, ఇతర వివరాలను కంపెనీ వెల్లడించనుంది. మారుతీ సుజుకీ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్స్‌లో డిజైర్‌ ఒకటి.

Advertisement

తాజా వార్తలు

Advertisement