Saturday, April 20, 2024

కార్ల ధరల పెంచిన టాటా.. న‌వంబ‌ర్ 7 నుంచి అమ‌ల్లోకి

ప్రముఖ ఆటోమొబైట్‌ కంపెనీ టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంచింది. నవంబర్‌ 7 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. కార్ల ధరలను సగటున 0.9 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన కంపోనెంట్స్‌ ధరల కారణంగా ఇప్పటికే కొంత భారాన్ని భరిస్తున్నామని, ఉత్పత్తి వ్యయం పెరగడంతో పరిమిత స్థాయిలో పెంపు నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

అంతకు ముందు జులైలోనూ టాటా మోటార్స్‌ కార్ల ధరలను 0.55 శాతం పెంచింది. ప్రస్తుతం టియాగో, పుంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ, టియాగో బ్రాండ్‌ పేర్లతో టాటా మోటార్స్‌ కార్లు విక్రయిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 78,335 కార్లను విక్రయించింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి 15.49 శాతం అధికంగా విక్రయాలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement