Thursday, April 25, 2024

కరోనా టెన్షన్..కూప్పకూలుతున్న మార్కెట్లు

దేశంలో పెరిగిపోతున్న క‌రోనా కేసులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపాయి. ఆరంభంలో సూచీలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1479 పాయింట్లు నష్ట‌పోగా.. నిఫ్టీ 14400 పాయింట్ల దిగువ‌కు వ‌చ్చింది. బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. కొవిడ్ భ‌యాలు ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌ను దెబ్బ‌తీశాయి. గ‌త 24 గంటల్లో దేశంలో క‌రోనా కేసులు కొత్త రికార్డులు సృష్టించాయి. ఏకంగా 1.69 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 1,68,912 కొత్త కేసులు నమోదు కావడం… గత ఏడు రోజుల్లో ఇది 6వ రికార్డు స్థాయి పెరుగుదల కావడం తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement