Wednesday, May 19, 2021

భారీ లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు, అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్, 837 పాయింట్లు పెరిగి 1.71 శాతం లాభంతో 49,845 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 263 పాయింట్లు పెరిగి 1.81 శాతం లాభంతో 14,770 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని, సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు నూతన ఈక్విటీల కొనుగోలుకు ఆసక్తిని చూపుతున్నారని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News