Friday, March 29, 2024

లాభాల్లతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 స్టాక్‌మార్కెట్లు వారాంతంలో పటిష్టంగా ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల ర్యాలీ, వరుసగా నాలుగవ రోజు లక్ష కన్నా తక్కువ రోజువారీ కరోనా వైరస్ కేసుల నమోదు దేశంలో రుతుపవనాల ప్రారంభం  ఇన్వెస్టర్లసెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా కీలక సూచీలు రికార్డు స్థాయిని నమోదు చేశాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు జూమ్ చేసి 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే వారం ముగింపులో  ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 174 పాయింట్లు, నిఫ్టీ  62 పాయింట్ల మేర లాభపడింది. 52,474 వద్ద  సెన్సెక్స్‌, 15,799.35 రికార్డు స్థాయిలో ముగిసింది.  దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి.  ప్రధానంగా ఐటీ,  మెటల్ షేర్ల లాభాలు భారీ మద్దతునిచ్చాయి. రియాల్టీ,  మీడియా, బ్యాంక్ సూచీలు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement