Saturday, April 20, 2024

33 శాతం తగ్గిన స్టార్టప్‌ ఫండింగ్‌.. 2022లో 24 బిలియన్‌ డాలర్ల నిధులు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగించడం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వంటి కారణాల వల్ల 2022లో మన దేశంలో స్టార్టప్‌లకు 33 శాతం ఫండింగ్‌ తగ్గి, 24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నిధులు 2019, 2020లో వచ్చిన వాటి కంటే రెట్టింపుగా ఉన్నాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ చాలా వరకు గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఇండియన్‌ స్టార్టప్‌ల పట్ల సానుకూలంగానే ఉన్నారని నివేదిక తెలిపింది. 2021తో పోల్చితే 2022లో స్టార్టప్‌ల ఫండింగ్‌ భారీగా తగ్గిందని తెలిపింది. స్టార్టప్‌లు 2019లో 13.2 బిలియన్‌ డాలర్లు, 2020లో 10.9 బిలియన్‌ డాలర్లు, 2021లో 35.2 బిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ను పొందాయి.

నిధులు తగ్గినప్పటికీ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌లో చాలా వరకు ఫిండింగ్‌ చెప్పుకోదగిన స్థాయిలోఉందని డీల్స్‌ అండ్‌ ఇండియా స్టార్టప్‌ లీడర్‌ పీడబ్ల్యూసీ ఇందియాకు చెందిన అమిత్‌ నావ్కా అభిప్రాయపడ్డారు. రానున్న రెండు,మూడు త్రైమాసికల్లో పరిస్థితి చక్కబడుతుందని అభిప్రాపయడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్టార్టప్‌లు పలు నియంత్రణ చర్యలు తీసుకున్నారని, నిధుల లభ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. 2021. 2022లో ఎక్కువ డీల్స్‌ త్వరగా జరిగినవే 60-62 శాతం వరకు ఉన్నాయని నివేదిక తెలిపింది. సరాసరి డీల్‌ విలువ 4 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

- Advertisement -

నగరాల వారిగా ఫండింగ్‌ పొందిన స్టార్టప్‌లు చూస్తే ప్రధానంగా బెంగళూర్‌, ఎన్‌సీఆర్‌, ముంబై నగరాల్లో 82 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌లో ఈ నగరాల్లో ఉన్న 28శాతం స్టార్టప్‌లు 20 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాయి. స్టార్టప్‌ యూనికార్న్‌ కంపెనీల ఫండింగ్‌ విషయంలో బెంగళూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఎన్‌సీఆర్‌ ప్రాంతం, మూడో స్థానంలో ముంబై ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement