Sunday, December 8, 2024

సౌర విద్యుత్‌ ఉత్పత్తిలోనూ పర్యావరణానికి ముప్పు..

బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా కార్బన్‌ వాయువు ఉత్పత్తి అయి పర్యావరణం దెబ్బతింటోందని వాతవరణ వేత్తలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి ప్రత్యామ్నయంగా అణు విద్యుత్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ అణుశుద్ది చేయడం ప్రమాదకరమని, దీని ద్వారా కూడా పర్యావరణ ముప్పు ఉందని చెబుతున్నారు. వీటికి ప్రత్యామ్నయంగా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండింటితో పర్యావరణానికి మేలు జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అనేక దేశాల్లో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రారంభమయింది.

కానీ ఈ ప్లాంట్ల విద్యుత్‌ ఉత్పత్తిలో పర్యావరణానికి హాని కల్గించే పరిస్తితి లేనప్పటికీ ఈ ప్లాంట్ల ఏర్పాటులో వాడే పరికరాల తయారీ ప్రక్రియలో మాత్రం పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని కొందరు కొత్త వాదనను ముందకు తెచ్చారు. శిలాజ ఇంధనాలతో పోలిస్తే సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తికి అదనంగా 300 శాతం భూమి, 300 శాతం రాగి, 400 శాతం రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు అవసరమని లెక్క తేల్చారు. రాగి, రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు వెలికి తీయడానికి, వాటిని శుభ్రం చేయడానికి ఎంతో శ్రమ అసరమమైతుంది, దాని ద్వారా పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది.

300 శాతం అదనంగా భూమి అవసరం

ర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ఒక బొగ్గు ఆధారిత ప్లాంట్‌ కన్నా అధికంగా 300 శాతం భూములు అవసరమౌతాయి. అసలకే ప్రపంచ జనభా పెరిగిపోతూ ఆహార ఉత్పత్తుల కోసం బీడు భూములను కూడా పంట పోలాలుగా మార్చుతున్న నేటి తరుణంలో ఇక సౌర విద్యుత్‌కు ఇంత పెద్ద ఎత్తున భూమిని కేటాయించడం సాధ్యమౌతుందా అనేది ప్రశ్న. సౌర విద్యుత్‌ ప్లాంట్లలో రెండు రకాల ప్లాంట్లు ఉంటాయి. ఫోటో వొలిటిక్‌ సోలార్‌ సెల్స్‌తో ఏర్పాటు చేసే ప్లాంట్‌కు ఒక మెగావాట్‌కు మూడున్నర నుండి పది ఎకరాల స్థలం అవసరమౌతాయి. అదే కాన్‌సన్‌ట్రేటింగ్‌ సోలార్‌ థర్మల్‌ ప్లాంట్స్‌ ఏర్పాటుకు ఒక మెగావాట్‌కు నాలుగు నుండి 16.5 ఎకరాల స్థలం అవసరమౌతుంది. ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి నీరు అవసరం లేకున్నప్పటికీ కానీ తయారీ క్రమంలో నీరు వాడతారు. అంతేకాక సిఎస్‌పి ప్లాంట్‌కు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ మాదిరి కూలింగ్‌ అవసరమౌతుంది. ఒక మెగావాట్‌ ఉత్పత్తికి 600 నుండి 650 వ్యాగన్ల నీరు అవసరమౌతుంది.

- Advertisement -

ప్రమాదకర మేటీరియల్స్‌ వాడకం

సౌర ఫలకాల తయారీలో రాగి ఖనిజాన్ని ఎక్కువగా వాడతారు. వీటితోపాటు రేర్‌ ఎర్త్‌ ఖనిజాలను కూడా వాడతారు. ఈ ఖనిజాలను వెలికితీయడం, వాటిని శుభ్రపరచడం చాలా ప్రమాదంతో కూడకున్న పని. ఆ పని చేసే కార్మికులకు ప్రాణాపాయమే కాక పర్యావరణానికి కూడా పెద్ద దెబ్బ. పివి సెల్స్‌ తయారీలో చాలా ప్రమాదకర ఖనిజాలను వాడతారు. సెమీకండక్టర్‌ సర్ఫేస్‌ను శుభ్రం చేయడానికి వీటని వాడతారు. హైడ్రాలిక్‌ యాసిడ్‌, సల్ఫూరిక్‌ యాసిడ్‌, నిట్రిక్‌ యాసిడ్‌ లాంటి ప్రమాదకర రసాయనాలు వాడతారు. తేలికపాటి ఫిల్మ్‌ ఆధారంగా రూపొందించే ఫోటో వాలటిక్‌ సోలార్‌ సెల్స్‌లో చాలా విషపూరితమైన ఖనిజాలను వాడుతున్నారు. ఇవన్నీ కూడా అక్కడ పనిచేసే మనుషులతోపాటు పర్యావరణానికి కూడా హాని కల్గించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement