Wednesday, April 24, 2024

11 క్రిఫ్టో ఎక్స్ఛేంజీలకు షాక్‌, జీఎస్‌టీ కింద రూ.95కోట్లు రికవరీ.. వజీర్‌ ఎక్స్‌ నుంచి అత్యధికం

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత కారణంగా.. 11 క్రిఎ్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల నుంచి రూ.95.86 కోట్లు రికవరీ చేసినట్టు కేంద్రం సోమవారం ప్రకటించింది. రికవరీ చేసిన మొత్తంలో పెనాల్టిdతో పాటు వడ్డీ కూడా ఉందని తెలిపింది. జన్మయి ల్యాబ్స్‌ (వజీర్‌ఎక్స్‌), కాయిన్‌ డీసీఎక్స్‌, కాయిన్‌స్విచ్‌ కుబేర్‌, బై యూకాయిన్‌, యూనో కాయిన్‌తో పాటు ఫ్లిట్‌పే ఎక్స్ఛేంజీల నుంచి ఈ మొత్తం రికవరీ చేసినట్టు జీఎస్‌టీ సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటితో పాటు జెబ్‌ ఐటీ సర్వీసెస్‌, సెక్యూర్‌ బిట్‌ కాయిన్‌ ట్రేడర్స్‌, జియోట్టస్‌ టెక్నాలజీస్‌, అవ్లెన్‌కాన్‌ ఇన్నోవేషన్స్‌ ఇండియా (జెబ్‌ పే)తో పాటు డిసీడియం ఇంటర్నెట్‌ ల్యాబ్స్‌ కూడా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చదరీ లోక్‌సభలో ప్రకటించారు. సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్రిఎ్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా జీఎస్‌టీని ఎగవేసిన 11 కేసులను సెంట్రల్‌ జీఎస్‌టీ ఫార్మేషన్ల ద్వారా గుర్తించామని ఆర్థిక శాఖ తెలిపింది. రూ.81.54 కోట్లు ఎగవేత గుర్తించారు. వడ్డీ, జరిమానా కలుపుకుంటే.. రూ.95.86 కోట్లుగా తేలిందని పంకజ్‌ చదరీ వివరించారు. లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. జన్మయి ల్యాబ్స్‌ (వజీర్‌ ఎక్స్‌) నుంచి రూ.49.18 కోట్లు, కాయిన్‌ డీసీఎక్స్‌ నుంచి రూ.17.1 కోట్లు, కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ నుంచి రూ.16.07 కోట్లు రికవరీ చేసినట్టు ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement