Thursday, April 18, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా ఆందోళనలు కొనసాగుతన్ననప్పటికి బ్యాంకింగ్, మెటల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 508 పాయింట్లు లాభపడి 48,386కి చేరింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 14,485 వద్ద స్థిరపడింది. ఇక ఈ రోజు ఉదయం 48,197 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 9:50 గంటల సమయానికి 700 పాయింట్లు లాభపడింది. 14,449 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ ఉదయం 9:50 గంటల సమయానికి 198 పాయింట్లు లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాలను ఆర్జిస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, బ్రిటానియా, సిప్లా, హీరో మోటోకార్ప్ నష్టాలను చవిచూస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement