Friday, March 29, 2024

ఎస్‌బీఐ లాభం 41శాతం వృద్ధి, క్యు4లో రూ.9,114 కోట్ల ప్రాఫిట్‌

ప్రభుతరంగ అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. స్టాండ్‌లోన్‌ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను జనవరి-మార్చి కాలంలో రూ.9,114 కోట్ల నికర లాభాలను పొందినట్టు వివరించింది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో నాల్గో త్రైమాసికంలో రూ.6,451 కోట్ల లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ త్రైమాసింకలో కొత్త నిరర్ధక ఆస్తులు 3.97 శాతంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే.. బ్యాంకు నిరర్ధక ఆస్తులు సల్పంగా తగ్గి.. 1.02 శాతానికి చేరాయి.

అదేవిధంగా ఎస్‌బీఐ మొత్తం ఏకీకృత ఆదాయం 2020-21లో రూ.81,327 కోట్లు నమోదవ్వగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో.. రూ.82,613 కోట్లుగా రికార్డయ్యింది. నాల్గో త్రైమాసికానికి సంబంధించిన లాభం 56 శాతం పెరిగి.. రూ.9,549 కోట్లకు చేరుకుంది. అయితే నాల్గో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాల అంచానాలను ఎస్‌బీఐ అందుకోలేకపోయింది. దీంతో షేర్‌ విలువ 3.89 శాతానికి పైగా నష్టపోయి… రూ.444.65 వద్ద ముగిశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. మొత్తంగా చూస్తే.. బ్యాంకు స్టాండ్‌లోన్‌ నికర లాభాలు 55 శాతం వృద్ధి చెంది రూ.31,676 కోట్లుగా నమోదయ్యాయి. దాని క్రితం ఏడాది ఇది రూ.20,410 కోట్లుగా ఉండింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను.. ఒక్కో షేర్‌పై రూ.7.10 (ముఖ విలువపై 710 శాతం) డివిడెంట్‌ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement