Thursday, April 25, 2024

హౌసింగ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీరేటును పెంచింది. మార్చి 1న గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించిన ఎస్ బీఐ మరోసారి సవరణ చేపట్టింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ తాజా ప్రకటన చేసింది. దాంతో హౌసింగ్ లోన్లపై వడ్డీ రేటు తాజా సవరణతో కలిపి 6.95 శాతానికి పెరిగింది. ఈ సవరించిన వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఇదే కాకుండా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రుణ పరిధిని అనుసరించి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండనుంది. గృహ రుణాలపై  జీఎస్టీ కూడా విధించనున్నారు. ఇంత వ‌ర‌కూ ఎస్‌బీఐను చూసి వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఇత‌ర బ్యాంకులు కూడా ఇప్పుడు పెంచే అవ‌కాశాలు ఉన్నాయి.

వ‌డ్డీ రేటు పెంచ‌డ‌మే కాదు.. ఇక నుంచీ అన్ని హోమ్‌లోన్ల‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ఎస్ బీఐ స్ప‌ష్టం చేసింది. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 0.4 శాతం ప్ల‌స్ జీఎస్టీ వ‌సూలు చేస్తుంది. ఇది సాధార‌ణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గ‌రిష్ఠంగా రూ.30 ప్ల‌స్ జీఎస్టీ ఉంటుంది. ప‌రిమిత స‌మ‌యానికి గ‌త నెల‌లో ఎస్‌బీఐ హోమ్‌లోన్ల‌పై వ‌డ్డీ రేటును త‌గ్గించ‌డంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement