Tuesday, April 16, 2024

ప్యాసింజర్‌ వాహనాల జోష్ , పెద్ద ఎత్తున పెరిగిన అమ్మ‌కాలు

దేశవ్యాప్తంగా ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు జులైలో పెరిగాయి. జూన్‌ నెలలో 2,64,442 యూనిట్ల అమ్మకాలు జరిగితే , జులైలో 2,93,865 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీల నుంచి డీలర్లకు ప్యాసింజర్‌ వాహనాల డిస్పాచ్‌ 11 శాతం పెరిగినట్లు డీలర్స్‌ అసోయియేషన్‌ ఎస్‌ఐఏఎం తెలిపింది. సెమీకండక్టర్ల సరఫరా పెరగడంతో కంపెనీలు ఉత్పత్తిని పెంచినట్లు తెలిపారు. ప్యాసింజర్‌ కార్ల డిస్పాచ్‌ 10 శాతం పెరిగింది. గత సంవత్సరం జులైలో 1,30,080 యూనిట్లు డిస్పాచ్‌ అయితే, ఈ సంవత్సరం జులైలో ఈ సంఖ్య 1,43,522కు పెరి గిది. యూటిలిటీ వాహనాల 11 శాతం పెరిగి 1,37,104 యూనిట్ల డిస్పాచ్‌ చేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 1,24,057 యూనిట్లను డిస్పాచ్‌ చేశారు. వ్యాన్ల డిస్పాచ్‌ 10,305 నుంచి 13,239 వరకు పెరిగాయి. టూ వీలర్ల డిస్పాచ్‌ 10 శాతం పెరిగాయని సైమా తెలిపింది.

గత సంవత్సరం జులైలో 12,60,140 టూ వీలర్లను డిస్పాచ్‌ చేయగా, ఈ సంవత్సరం ఇది 13,81,303 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్లు 3,73,694 యూనిట్ల నుంచి 4,79,159 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌ సైకిళ్ల డిస్పాచ్‌ 8,37,166 నుంచి 8,70,028 యూనిట్లకు పెరిగాయి. త్రీ వీలర్స్‌ 18,132 యూనిట్ల నుంచి 31,324 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు ఇంకా జులై 2016 కంటే తక్కువగానే ఉన్నాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మన్యూఫాక్చరర్స్‌ ఆసోసియేషన్‌ (ఎస్‌ఐఏ ఎం) డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ తెలిపారు. త్రీ వీలర్స్‌ అమ్మకాలు 2006 కంటే తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎంట్రీ లెవల్‌ వాహనాల అమ్మకాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని ఆయన చెప్పారు. రిటైల్‌ సీఎన్‌జీ రేట్లు తగ్గిస్తే ఈ రంగంలో వస్తున్న కొత్త వ్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement