Friday, March 29, 2024

రెనాల్ట్‌ భారీ ఆఫర్స్‌.. ఏప్రిల్ 30వరకు అవకాశం..

ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్‌ ఇండియా ఏప్రిల్‌ నెలలో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. తమ కంపెనీ కార్లపై రూ.55వేల వరకు డిస్కౌంట్‌ అందజేస్తున్నట్లు తెలిపింది.ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 30వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. రెనాల్ట్‌ క్విడ్‌పై ఎక్స్ఛేంజ్‌ బెనిఫిట్‌ రూ.10వేల వరకు అందుబాటులో ఉంది. 1.0లీటర్‌ మోడల్‌పై రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, 0.8 లీటర్‌ మోడల్‌పై రూ.10వేలు బోనస్‌తో కలిపి మొత్తం రూ.35వేలవరకు బెనిఫిట్స్‌ లభిస్తాయని రెనాల్ట్‌ ఇండియా ప్రకటించింది.

రెనాల్ట్‌ ఇండియా కిగర్‌ ఎస్‌యూవీపై స్పెషల్‌ లాయల్టి బెనిఫిట్‌ కింద రూ.55వేలవరకు బెనిఫిట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. రెనాల్ట్‌ ట్రైబర్‌పై రూ.40వేల వరకు బెనిఫిట్స్‌ పొందొచ్చు. 2022 మోడల్‌కు అన్ని వేరియంట్స్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement