Friday, December 6, 2024

రిలయన్స్‌, వాల్ట్‌ డిస్నీ విలీనం… ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ !

దేశ మీడియా రంగంలో అతి పెద్ద విలీనం పూర్తయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన మీడియా వ్యాపారాలు గురువారం నాడు విలీనంపై ఒక సంయుక్త ప్రకటన చేశాయి. ఈ విలీనంతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీగా ఇది ఏర్పాటు కానుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ విలువ 70,352 కోట్లుతో దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థగా ఏర్పాటైంది.

ఈ జాయింట్‌ వెంచర్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఆధీనంలో పని చేస్తుంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 16.34 శాతం. వయాకామ్‌ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం వాటాలు ఉంటాయి. ఇక‌ ఈ జాయింట్‌ వెంచర్‌కు ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ అధనంగా 11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement