Thursday, April 25, 2024

ఐడీబీఐ కొనుగోలులో నిబంధనల సడలింపు.. సెబీని కోరిన ప్రభుత్వం

ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం నిబంధనలను సడలించాలని కోరుతోంది. పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం సెబీని కోరింది. ప్రభుత్వం ఇప్పటికే 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందులో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా కలిగి ఉంది. బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌యి కనీసం మూడు సంవత్సరాల పూర్తి చేసుకుని, కనీసం 25 శాతం పబ్లిక్‌ హోల్డింగ్స్‌ కలిగి ఉన్న కంపెనీలు, సంస్థలు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి. ఈ నిబంధన సడలించడం వల్ల ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గేనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, ఎల్‌ఐసీ వాటా అమ్మకం తరువాత కూడా ఈ రెంటింటికి కలిపి 34 శాతం వాటా ఉంటుంది.

ఈ వాటాను పబ్లిక్‌ ప్లోట్‌గా వర్గీకరించగలరా అని ప్రభుత్వం సెబీని కోరింది. ఇది కొత్తగా బ్యాంక్‌ను కొనుగోలు చేసిన వారికి కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ ప్రమాణాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది. సెబీ కనుక ప్ర్‌భుత్వం, ఎల్‌ఐసీకి ఉన్న 34 శాతం వాటాను పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌గా వర్గీకరిస్తే, కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధన పూర్తి చేసినట్లు అవుతుందని ఒక అధికారి చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి 95 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయానికి పెట్టింది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక ప్ర్‌భుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోంది. ఇందులో కొన్నింటిలో విఫలమైంది. ఏయిర్‌ ఇండియాను మాత్రం టాటా గ్రూప్‌కు విజయవంతంగా విక్రయించింది. ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రవేటీకరిస్తామని ప్రభుత్వం 2916లోనే ప్రకటించింది. కాని ఇది చాలా సార్లు వాయిదాపడుతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement