Thursday, November 28, 2024

PhonePe | కొత్త తరహా మోసాల నుండి సురక్షితం కోసం ఫోన్ పే మార్గదర్శకాలు..

నకిలీ పేమెంట్ యాప్ లతో జరిగే కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్న విషయంపై మర్చంట్లు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన పేమెంట్ అప్లికేషన్ల తరహాలోనే నకిలీ పేమెంట్ యాప్ లు ఉంటాయి. అవి పాపులర్ పేమెంట్ యాప్ ల రూపాన్ని పోలినట్టే ఉంటే UI, రంగు పద్ధతులను కలిగి, చాలావరకు పేమెంట్ ప్రక్రియ కూడా అదే తరహాలో ప్రతిబింబించేలా ఉంటుండడంతో పైపైకి చూస్తే వాటిని నకిలీవని గుర్తించడం మర్చంట్లకు కష్టతరమవుతుంది. ఈ మోసపూరిత యాప్ లలో కొన్నయితే మరింత ముందుకు వెళ్లి, పేమెంట్ అందినట్టు తప్పుగా మనకు అర్థమయ్యేలా పేమెంట్ నోటిఫికేషన్లను కూడా అందిస్తూ, మనల్ని భ్రమ పెడుతున్నాయి. అంతేకాక, అవి విజయవంతమైన లావాదేవీని చూపించేందుకు పేమెంట్ సమాచారాన్ని కూడా తయారు చేస్తుండడంతో వాటిని మర్చంట్లు సులభంగా నమ్మేసే పరిస్థితి ఏర్పడుతోంది.

నకిలీ పేమెంట్ యాప్ మోసాల నుండి తమను తాము రక్షించుకునేలా మర్చంట్ల కోసం ఫోన్ పేలోని సైబర్ భద్రత నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకుంటున్నారు.
వారి వ్యాపారాలను రక్షించుకోవడం కోసం, మర్చంట్లు అప్రమత్తంగా ఉంటూ, తమ పేమెంట్ యాప్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీ వివరాలను వెరిఫే చేసుకోవాలి. అలాగే ఎక్కడైనా తేడా ఉందా అని వివరాలను పరిశీలించాలి. కస్టమర్లు హడావిడిలో చేసే ఒత్తిడి యుక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాగా ప్రచారంలో లేని పేమెంట్ యాప్ లను, మోసపూరిత లావాదేవీలను ఎలా గుర్తించాలనే దాని గురించి ఉపయోగించడాన్ని నివారించండి. నకిలీ పేమెంట్ యాప్ మోసాల గురించి మర్చంట్లు తమ సిబ్బందికి అవగాహన కల్పించాలి.

సరుకులు, సర్వీసులను అందించే ముందు పేమెంట్లను వెరిఫై చేసేందుకు వారు ఒక ప్రామాణిక ప్రక్రియను అమలు చేయవచ్చు. అంటే లావాదేవీ ఐడీని చెక్ చేయడం లేదా మీ పేమెంట్ ప్రాసెసర్ నుండి నిర్ధారణ కోసం వేచి చూడడం వంటివి ఇందులో ఉండవచ్చు. ఫేక్ పేమెంట్ యాప్ ప్రమేయంతో మోసపూరిత కార్యకలాపాలు జరిగినట్టు మీకు అనుమానం కలిగితే, సంబంధిత అధికారులకు లేదా మీ పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థకు వెంటనే దానిని నివేదించండి.

- Advertisement -

ఫోన్‌పే ద్వారా మోసగాడు ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తే, మీరు వెంటనే ఈ తరహా మోసాలను ఫోన్‌పే యాప్‌లో కానీ, లేదా కస్టమర్ కేర్ నంబర్లు అయిన 080–68727374 / 022–68727374లకు ఫోన్ చేయడం ద్వారా లేదా ఫోన్‌పే అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చివరగా, మీరు ఈ మోసానికి సంబంధించిన ఫిర్యాదులను మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ సెల్ వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా https://www.cybercrime.gov.in/ లో ఆన్‌లైన్ ఫిర్యాదును రిజిస్టర్ చేయడం లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను 1930లో సంప్రదించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement