Wednesday, April 24, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓగా పీటర్‌ ఎల్బర్స్‌.. అక్టోబర్ నుంచి బాధ్య‌త‌లు..

న్యూఢిల్లి : ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పీటర్‌ ఎల్బర్స్‌ను నియమిస్తూ.. సదరు సంస్థ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ భాగస్వామ్య సంస్థగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అతి తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. 2022, అక్టోబర్‌ 1 నుంచి ఎల్బర్స్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పూర్తి స్థాయి సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. 71 ఏళ్ల రొనోజోయ్‌ దత్తా.. విజయవంతంగా సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారని, 2022, సెప్టెంబర్‌ 30న ఆయన పదవీ విరమణ పొందుతున్నారని సంస్థ వివరించింది. ఆయన ఆధ్వర్యంలో.. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఇండియా ఎయిర్‌లైన్స్‌ సేవలు అందించిందని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎండీ రాహుల్‌ భాటియా మాట్లాడుతూ..

బోర్డు డైరెక్టర్లతో పాటు తన తరఫున దత్తాకు ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు. నాలుగేళ్ల పాటు సంస్థకు అమూల్యమైన సేవలు అందించారని గుర్తు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించారని, ఎయిర్‌లైన్‌ చరిత్రలో, ప్రపంచ ఏవియేషన్‌ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని వివరించారు. 2014 నుంచి 52 ఏళ్ల ఎల్బర్స్‌ కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌కు సీఈఓ, ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఎయిర్‌ఫ్రాన్స్‌-కేఎల్‌ఎం గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, బిజినెస్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement