Tuesday, March 26, 2024

పర్యాటక ప్రాంతాల్లో మరింత విస్తరించనున్న ఓయో

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : గ్లోబల్‌ హాస్పిటాలిటీ టెక్నాలజీ మేజర్‌, ఓయో తన లీజర్‌ ఆఫర్‌ను కీలకమైన పర్యాటక కేంద్రాల్లో గణనీయంగా విస్తరించాలని యోచిస్తోంది. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి గత కొన్ని నెలలుగా మనోరంజన కోసం పర్యటనలు భారీ స్థాయిలో ఊపందుకున్నాయి. ఈ విభాగంలోకి మరింత వేగంగా ప్రవేశించేందుకు, భారతదేశం వ్యాప్తంగా, కీలకమైన లీజర్‌ గమ్యస్థానాల్లో 1000 హోటళ్లు, గృహాలను (స్టోర్‌ ఫ్రంట్‌లు) చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సెప్టెంబరు 2022 నాటికి తన ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే 600కి పైగా స్టోర్‌ఫ్రంట్‌లను చేర్చుకుంది. ఉత్సవాలతో ప్రారంభం కానున్న రాబోయే పీక్‌ సీజన్‌ శీతాకాల విరామంతో కొనసాగు తుంది. ఓయో ప్రస్తుత క్యాలెండర్‌ ఏడాది ముగిసే సమయానికి మరో 400 స్టోర్‌ ఫ్రంట్‌లను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఓయో టాప్‌ లీజర్‌ బ్రాండ్‌లలో 4బై ఓయో, 5బై ఓయో, ఓయో టౌన్‌హౌస్‌, టౌన్‌హౌస్‌ ఓక్‌, క్యాపిటల్‌ ఓ, కలెక్షన్‌ ఓ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement