Thursday, April 25, 2024

మిడ్-స‌మ్మర్‌ వెకేషన్‌ ఇండెక్స 2022 ప్రకటించిన ఓయో..

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌: దేశంలోని చాలా ప్రాంతాల్లో మహమ్మారి అనంతరం ప్రయాణ పరిమితులు పూర్తిగా తొలగించిన తర్వాత వచ్చిన మొదటి వేసవి ఇది. అంటే ఈ వేసవిలో ప్రజలకు ప్రయాణ ఆకాంక్షలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా వినియోగదారుల ప్రయాణ సెంటిమెంట్‌ను ట్రాక్‌ చేస్తూ గ్లోబల్‌ ట్రావెల్‌ టెక్నాలజీ కంపెనీ ఓయో, మిడ్- స‌మ్మర్‌ వెకేషన్‌ ఇండెక్స్‌ 2022ని ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం 61శాతం మంది భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో సెలవులు తీసుకోవాలని ప్లాన్‌ చేసుకోగా, అందులో 94శాతం మంది దేశీయంగా ప్రయాణించడమే తమ దృఢ నిశ్చయమని తెలిపారు.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభమైనప్పటికీ 2022లో స్థానిక డెస్టినేషన్లను అన్వేషించడానికే దేశీయ ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నరని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అందరూ టీకా వేయించుకుని ఉండడం, తగ్గుముఖంపడుతున్న మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోని ప్రజలు విశ్వాసంతో తిరిగి ప్రయాణాలను ప్రారంభిస్తున్నారనే దానికి ఇది అద్దం పడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement