Saturday, March 25, 2023

క్రెడిట్ కార్డుతోనూ ఐటీ రిటర్న్స్ చెల్లింపులు

పాత వెబ్‌సైట్‌లో ఉన్న ప్రతికూలతలను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొత్త ఐటీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పన్ను చెల్లింపుదార్ల సౌకర్యార్థం కొద్దిరోజుల్లో దీనికి మరిన్ని ఫీచర్లను జతచేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. పన్నులు, ఫీజులు, జరిమానాల వసూలు సహా రీఫండ్ల వంటి సేవలను అందించేందుకు ప్రైవేటు బ్యాంకులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో కొత్త వెబ్‌సైట్‌లో ఆయా బ్యాంకులను చేర్చనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా బ్యాంకులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇప్పటి వరకు నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం వినియోగదారులకు ఉంది. అయితే, మెజారిటీ ప్రైవేటు బ్యాంకులకు పోర్టల్‌లో చోటు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, యూపీఐ వంటి కొత్త చెల్లింపు మాధ్యమాలను సైట్‌కి జత చేయాలని యోచిస్తోంది. మరో వారం రోజుల్లో ఈ కొత్త వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement