Thursday, March 28, 2024

క్రిఫ్టో క‌రెన్సీ కట్టడికి కొత్త చట్టం?

న్యూఢిల్లీ: బిట్‌ కాయిన్‌, ఎథీరియం, డోజ్‌కాయిన్‌ తదితర క్రిఎ్టో కరెన్సీకి దేశ, విదేశాల్లో ఎంతో డిమాండ్‌ ఉంది. అయితే క్రిఎ్టో కరెన్సీ నియంత్రణ ఆయా ప్రభుత్వాల చేతుల్లో లేదు. చట్టవిరుద్ద కార్యకలాపాలకు క్రిఎ్టో కరెన్సీని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో బిట్‌కాయిన్‌ స్కీమ్‌ వెలుగు చూసింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మాదిరిగానే కేంద్రం కూడా క్రిఎ్టో కరెన్సీ కట్టడికి చర్యలు తీసుకోనున్నదని సమాచారం. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టి..ఆ బిల్లు చట్టంగా మారితే క్రిఎ్టో కరెన్సీల మదుపర్లు, క్రిఎ్టో కరెన్సీ ఎక్స్ఛెంజ్‌లకు కష్టాలు ఎదురవుతాయి. మదుపర్లు, క్రిఎ్టో ఎక్స్ఛెంజ్‌లు కొత్తచట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చైనా గత సెప్టెంబర్‌ నుంచే క్రిఎ్టో కరెన్సీల నియంత్రణ వేగవంతం చేసింది. ఇదే తరహాలో మోడీ సర్కార్‌ కూడా క్రిఎ్టో కరెన్సీ కట్టడికి చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తుందని సమాచారం. ఇన్వెస్టర్లను ఆకర్షించేలా క్రిఎ్టో కరెన్సీ ఏజెన్సీలు ప్రకటనలు జారీ చేయకుండా కేంద్రం చట్టంలో నిబంధనలు చేర్చనున్నారని తెలుస్తుంది. అయితే కేంద్రం వద్ద అధికారిక సమాచారం లేకున్నా పారిశ్రామిక వర్గాల కథనం మేరకు సుమారు రెండు కోట్లమంది ఇన్వెస్టర్లు రూ.45వేల కోట్లు పెట్టబడులు పెట్టారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement