Thursday, April 25, 2024

ఏప్రిల్‌తో కొత్త‌ ఆర్థిక సంవత్సరం స్టార్ట్.. వచ్చే నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు

మార్చ్​ నెల ముగింపు దశకు చేరుకుంది. ఇక ఏప్రిల్ 1నుంచి (2023-2024) కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది.​ అయితే.. ఈ నెల‌లో (మార్చ్) దాదాపు 12 రోజుల పాటు సెలవు తీసుకున్నా బ్యాంకులు.. మ‌రి వ‌చ్చే నెలలో (ఏప్రిల్) బ్యాంక్ సెల‌వులు గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం బ్యాంక్ క‌స్ట‌ర్మ‌ర్ల‌కు ఎంత‌నా ఉంది. అయితే, ఏప్రిల్​ నెలలో కేవలం 15 రోజులే పనిచేయనున్నాయి! ఆదివారాలతో పాటు లోక‌ల్ హాలిడేస్, రెండవ – నాల్గవ శనివారాలు సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకు పనుల కోసం తిరిగే వారు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఏప్రిల్​ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్​ను ఆర్​బీఐ ఇటీవలే విడుదల చేసింది. సెలవుల బట్టి మీ పనిని ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్​లో బ్యాంకు సెలవులు..

ఏప్రిల్​ 1, 2023:- బ్యాంక్స్​ యాన్యువల్​ క్లోజింగ్​. ఐజ్వాల్​, షిల్లాంగ్​, శిమ్లా, ఛండీగఢ్​లోని బ్యాంకులకు సెలవు.

- Advertisement -

ఏప్రిల్​ 2, 2023:- ఆదివారం.

ఏప్రిల్​ 4, 2023:- మహావీర్​ జయంతి. అహ్మదాబాద్​, ఐజ్వాల్​, బేలాపూర్​, బెంగళూరు, భోపాల్​, ఛండీగఢ్​, చెన్నై, జైపూర్​, కాన్పూర్​, కోల్​కతా, లక్నో, ముంబై, నాగ్​పూర్​, ఢిల్లీ, రాయ్​పూర్​, రాంఛీ బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 5, 2023:- జగ్జీవన్​ రామ్​ జయంతి. హైదరాబాద్​లోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 7, 2023:- గుడ్​ ఫ్రైడే. అగర్తలా, అహ్మదాబాద్​, గౌహతీ, జైపూర్​, జమ్ము, శిమ్లా, శ్రీనగర్​ మినహా.. దేశవ్యాప్తంగా అన్న బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 8, 2023:- రెండో శనివారం

ఏప్రిల్​ 9, 2023:- ఆదివారం

ఏప్రిల్​ 14, 2023:- అంబేడ్కర్​ జయంతి. భోపాల్​, ఢిల్లీ, రాయ్​పూర్​, షిల్లాంగ్​, శిమ్లా మినహా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 15, 2023:- విషు, బహగ్​, బిహు, హిమాచల్​ డే, బెంగాళీ నూతన ఏడాది ప్రారంభం. అగర్తలా, గౌహతీ, కొచ్చి, కోల్​కతా, శిమ్లా, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 16, 2023:- ఆదివారం.

ఏప్రిల్​ 18, 2023:- సాబ్​ ఇ కద్ర్​. జమ్ముకశ్మీర్​ బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 21, 2023:- ఈద్​- ఉల్​- ఫితర్​. త్రిపుర, జమ్ముకశ్మీర్​, కేరళలో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్​ 22, 2023:- నాలుగో శనివారం

ఏప్రిల్​ 23, 2023:- ఆదివారం

ఏప్రిల్​ 30, 2023:- ఆదివారం

సెలవు రోజుల్లో సేవలు ఇలా..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు, మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement