Wednesday, April 24, 2024

సెబీకి నవీ టెక్నాలజీస్‌ డీఆర్‌హెచ్‌పీ..

ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐగా సూక్ష్మ రుణ ఆర్థికవ్యవస్థలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నవీ టెక్నాలజీసీ లిమిటెడ్‌ (నీవీ) సెబీకి తమ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. నవీ కంపెనీ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా 3,350కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాలను అనుబంధ సంస్థలు నవీ ఫిన్‌సర్వ్‌ (ఎన్‌ఎఫ్‌పీఎల్‌), నవీ జనరల్‌ ఇన్యూరెన్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌జీఐఎల్‌)లో పెట్టుబడులు పెట్టనుంది.

వీటితోపాటు రూ.150కోట్లు ఎన్‌జీఐఎల్‌లో పెట్టుబడి పెట్టనుందని నవీ తెలిపింది. కాగా 2018లో ప్రారంభమైన నవీ..బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా డిజిటల్‌ వ్యక్తిగత రుణాలు, గృహరుణాలు, ఆరోగ్యబీమా, డిజిటల్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అందింస్తుంది. 2021 డిసెంబర్‌ 31నాటికి 4,81,121 వ్యక్తిగత రుణాల ద్వారా 2,246కోట్ల రూపాయలు పంపిణీ చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement