Friday, April 19, 2024

ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీవో టార్గెట్‌ 1800 కోట్లు!

ప్రయివేటురంగ సంస్థ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ ప్రమోట్‌ చేసిన కంపెనీ 2023 చివరి క్వార్టర్‌ నాటికి క్యాపిటల్‌ మార్కెట్లను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపింది. ఐపీవో ద్వారా రూ.1500-1800 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ థామస్‌ ముత్తూట్‌ తెలియజేశారు. దీంతో మైక్రోఫైనాన్స్‌ పరిశ్రమలో ఇది అతిపెద్ద ఐపీవో కానుంది. లిస్టింగ్‌ నాటికల్లా రూ.10,000 కోట్ల నిర్వహణలోని ఆస్తులు కలిగిన తొలి ఎంఎఫ్‌ఐగాను రికార్డు నెలకొల్పే అవకాశం కనిపిస్తోందని కంపెనీ ఎండీ తెలిపారు. కంపెనీలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌, ముత్తూట్‌ కుటుంబానికి 71శాతం వాటా ఉన్నట్లు వెల్లడించారు. పీఈ సంస్థ జీపీసీ 16.6 శాతం వాటాను కలిగివున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement