Thursday, April 25, 2024

ఈవీ బ్యాటరీల తయారీలోకి మిక్‌ ఎలక్ట్రానిక్స్ ..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : హైదరాబాద్‌కు చెందిన మిక్‌ (ఎంఐసీ) ఎలక్ట్రానిక్స్‌ విద్యుత్తు వాహనాల (ఈవీ) బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. బ్యాటరీస్‌ డివిజన్‌ ద్వారా లిథియమ్‌ ఆయాన్‌ సహా అన్నిరకాల విద్యుత్తు వాహన బ్యాటరీలు తయారు చేస్తామంది. దీంతో పాటు ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డుల వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వివరించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.45-60కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ పేర్కొంది.

మల్టి బ్రాండ్‌ విద్యుత్తు వాహనాల (ఈవీ) డీలర్‌షిప్‌ వ్యాపారంలో ఉన్న ఒక కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు సంస్థ ఎండీ కౌశిక్‌ యలమంచిలి తెలిపారు. కొంతకాలం క్రితం ఖాయిలాపడిన మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ను కొత్త యాజమాన్యం చేపట్టి గత ఏడాది జూన్‌ నుంచి వ్యాపార కార్యకలాపాలు పునరుద్దరించింది. ఓఎన్‌జీసీ నుంచి లభించిన 5000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరా కాంట్రాక్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు కౌశిక్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement