Wednesday, December 6, 2023

మంగోలియాలో మెగా క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ.. నిర్మించనున్న ఎంఈఐఎల్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: మంగోలియాలో అత్యాధునిక క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీని మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్పాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) నిర్మించనుంది. ఇది మంగోలియాలో మేఘా సంస్థ చేపట్టే మూడో భారీ ప్రాజెక్ట్‌. దీని విలువ 648 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ 5400 కోట్లు. ఇటీవల మంగోల్‌ రిఫైనరీ సంస్థ నుంచి లెటర్‌ అఫ్‌ అగ్రిమెంట్‌ ను మేఘా సంస్థ అందుకుంది. రిఫైనరీ నిర్మాణ ఒప్పందం పై శుక్రవారం మంగోల్‌ రిఫైనరీ, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్బాతర్‌ లో ఒప్పందం జరిగింది.

ఒప్పందం పై ఎంఈఐఎల్‌ ఎండీపీ వీ కృష్ణారెడ్డి సమక్షంలో మంగోల్‌ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అల్టాన్ట్సెట్సెగ్‌ దశ్దవా ఎం ఈ ఐ ఎల్‌ హైడ్రోకార్బన్స్‌ విభాగం అధ్యక్షుడు పీ రాజేష్‌ రెడ్డి సంతకాలు చేశారు. ఆయిల్‌ వెలికితీత, రవాణా, శుద్ధి రంగాల్లో ఇప్పటికే సేవలు అందించటంతో పాటు ఆన్‌ షోర్‌, ఆఫ్‌ షోర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా సంస్థ మంగోలియా లో చేపట్టిన మూడో ప్రాజెక్ట్‌ ఇది.

- Advertisement -
   

ఇప్పటికే మంగోలియా లో తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ ని 598 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 189 మిలియన్ల అమెరికన్‌ డాలర్లతో క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ ను కూడా మేఘా ఇంజనీరింగ్‌ నిర్మిస్తోంది. ఈ మూడు ప్రోజెక్టుల విలువ 1. 436 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు.

ఇండియా సహకారంలో ఎంతో కీలకం

ఒప్పందం అనంతరం మంగోల్‌ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అల్టాన్ట్సెట్సెగ్‌ దశ్దవా మాట్లాడుతూ భారత్‌, మంగోలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మంగోలియా రిఫైనరీ ప్రాజెక్ట్‌ ఒక ఉదాహరణ అని చెప్పారు. రెండు దేశాల మధ్య ఎంతో కాలం నుంచి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తమ దేశ అభివృద్ధిలో ఇండియా సహకారం ఎంతో కీలకమైందని అన్నారు.

ఎంఈఐఎల్‌ ఎండీపీ వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇండియా, మంగోలియా దేశాల మధ్య ఉన్న సత్‌ సంబంధాలకు తాము చేపట్టిన రిఫైనరీ పనులు ఒక ఉదాహరణ అని చెప్పారు. మంగోలియా లో తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు తమకు గర్వంగా ఉందన్నారు. నిర్ధేశిత కాల వ్యవధిలో తాము ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రిఫైనరీ వల్ల మంగోలియా ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతో పాటు, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు.

ఈపీపీ పద్ధతిలో…

ఈపీసీ పద్దతిలో డీజిల్‌ హైడ్రోట్రేటర్‌ యూనిట్‌ (డిహెచ్‌డిటి), హైడ్రోక్రాకర్‌ యూనిట్‌ (హెచ్‌సియు), ఎంఎస్‌ బ్లాక్‌ (ఎన్‌హెచ్‌టి ఐఎస్‌ఓ ఎంఎస్‌ఆర్‌ఆర్‌), విస్‌ బ్రేకర్‌ యూనిట్‌ (విబియు), హైడ్రోజన్‌ జనరేషన్‌ యూనిట్‌ (హెచ్‌జియూ), సల్ఫర్‌ బ్లాక్‌ (ఎస్‌ఆర్‌ యూ ఏఆర్‌యూఎస్‌ డబ్ల్యూ ఎస్‌), ఎల్‌పీజీ ట్రీటింగ్‌ యూనిట్‌ , హైడ్రోజన్‌ కంప్రెషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, మాచింగ్‌, ప్లాంట్‌ భవనాలు, శాటిలైట్‌ రాక్‌ రూమ్స్‌, సబ్‌ స్టేషన్స్‌, ఇతర సౌకర్యాలను క్రూడ్‌ ఆయిల్‌ లో రిఫైనరీలో ఎంఈఐఎల్‌ నిర్మించనుంది.

మంగోలియా లో మైనస్‌ 35 డిగ్రీల నుంచి ప్లస్‌ 40 డిగ్రీల వాతావరణంలో క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ ని మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించనుంది. మంగోలియా దేశంలో ఉపయోగించేందుకు అనువుగా గాసోలిన్‌, డీజిల్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్‌, ఎల్‌పీజీ తయారీకి ఉపయోగపడే 1. 5 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ ను ఈ ప్రభుత్వ రంగ రిఫైనరీ ఉత్పత్తి చేస్తుంది.

ఏ ఏ ప్లస్‌ రోబస్ట్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న ఎంఈఐఎల్‌ ప్రపంచంలోనే అత్యాధునిక రిగ్గులను తయారు చేసే తొలి ప్రైవేట్‌ సంస్థ . బెల్జియం, ఇటలీ, చిలి, అమెరికా లోని హౌస్టన్‌, తాజాగా తూర్పు మంగోలియాలో తన సేవలను అందిస్తోంది. హైడ్రోకార్బన్స్‌ విభాగంలో సెపరేషన్‌ యూనిట్స్‌, డిస్టిలేషన్‌, డిసాల్టింగ్‌ ప్లాంట్స్‌ ,గ్యాస్‌ డిహైడ్రాషన్‌ సౌకర్యాలు, గ్యాస్‌ కంప్రెషన్‌ ఇంస్టాళ్లషన్స్‌, గ్యాస్‌ పవర్‌ జనరేషన్‌ సెటప్స్‌ , స్టోరేజ్‌ ట్యాంక్‌ సిస్టమ్స్‌ , హైడ్రోకార్బన్‌ ఏప్లఎంట్‌ ట్రీట్మెంట్‌ సోలుషన్స్‌, స్ట్రక్చరల్‌, ప్లాంట్‌ పైపింగ్‌ పనులు మొదలైన వాటిని మేఘా ఇంజనీరింగ్‌ నిర్మిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ వికల్ప్‌ పలివాల్‌ , మంగోలియా ఎంపీ టి ఇంక్‌ టు షాన్‌ , మంగోలియాలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సంజీవకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement