Monday, June 5, 2023

ఫేస్‌బుక్‌లో భారీగా ఉద్యోగాల కోత

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో భారీగా ఉద్యోగాల కోత విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్విటర్‌ బాటలోనే ఉద్యోగులను తొలగించాలని మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌
కథనంలో పేర్కొంది. నవంబర్‌ 9న ఉద్యోగుల తొలగింపుపై మెటా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 87 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

మూడో త్రైమాసిక ఫలితాల్లో మెటా వాటాదారులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ 2023 వరకు ఉద్యోగుల సంఖ్య పెంచబోమని, ఉన్న సంఖ్యను కూడా స్వల్పంగా తగ్గిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ వార్త కథనం పేర్కొంది.
పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం భయాల నేపధ్యంలో అనేక టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త వారిని తీసుకోకపోవడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి.

- Advertisement -
   

అమెరికాలో గత వారం సిలికాన్‌ వ్యాలీలో ఉన్న అనేక సంస్థలు భారీగా లేఆఫ్‌లు ప్రకటించాయి. అమెజాన్‌ సంస్థ కూడా కార్పొరేట్‌ ఆఫీస్‌లో కొత్త నియామకాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థ వాణిజ్య ప్రకటనల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఈ సంత్సరం మూడో త్రైమాసికంలో మెటా లాభం 52 శాతం తగ్గి, 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement