Friday, October 11, 2024

HYD: బచ్చే బచ్చే కో పతా హై కొత్త కాంపైన్ ను ప్రకటించిన మార్టిన్..

హైద‌రాబాద్: కీటకాలను నియంత్రించడంలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్స్ లో ఒకటి మార్టిన్, కొత్త కాంపైన్ బచ్చే బచ్చే కో పతా హై కొత్త కాంపైన్ ను ప్రకటించింది. తమ వినూత్నమైన ఉత్పత్తి-మార్టిన్ 2-ఇన్-1, భారతదేశపు మొదటి 2-ఇన్-1 స్ప్రే పై శ్రద్ధ చూపించింది. ఇది బొద్దింకలు, దోమలు రెండిటిని 100శాతం చంపుతుంది. ఈసందర్భంగా రెకిట్ హైజీన్ దక్షిణాసియా రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌరభ్ జౌన్ మాట్లాడుతూ…. మార్టిన్ ఎల్లప్పుడూ పెరుగుతున్న తమ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అంకితమైందన్నారు.

భారతదేశంలో అత్యధిక కుటుంబాలు వినియోగిస్తున్న పెస్ట్ స్ప్రేలు దోమలు కోసం లేదా బొద్దింకలు కోసం రూపొందించ బడ్డాయన్నారు. తమ కొత్త కాంపైన్ భారతదేశపు 2-ఇన్-1 స్ప్రే ఎల్లప్పుడూ సంపూర్ణ శక్తిని అందిస్తుందని, ఈ స్ప్రే శక్తిని ప్రధానాంశంగా సూచిస్తోందన్నారు. హవాస్ క్రియేటివ్ ఇండియా జాయింట్ ఎండి అండ్ ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ అనుపమ రామస్వామి మాట్లాడుతూ… కొన్నిసార్లు వినియోగదారులను ఆకర్షించడం, వారిని నిర్లక్ష్యం నుండి బయటకు తీసుకురావడం చాలా ప్రధానమన్నారు. ఈ కాంపైన్ సాధారణ జీవితం ద్వారా, సంబంధిత పరిస్థితులను, సున్నితంగా తెలియచేసే లక్ష్యాన్ని ఇదే విధంగా ఖచ్చితంగా తెలియచేస్తోందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement