Thursday, April 25, 2024

రక్తహీనతను అధిగమించేందుకు మన్నా ఐస్ట్రాంగ్‌.. ఫోర్టిఫైడ్ డ్రింక్ గా డెవలప్..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : మన్నా ఐస్ట్రాంగ్‌, సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి ప్రత్యేకంగా రూపొందించబడిన ఐరన్‌ ఫోర్టిఫైడ్‌ మహిళల ఆరోగ్య పానీయం. మహిళల్లో రక్తహీనతతో పోరాడటానికి ఐస్ట్రాంగ్‌ సహాయపడుతుందని రుజువు చేసే క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను ప్రకటించింది. క్లీనికల్‌ అధ్యయన ఫలితాల గురించి సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ సీఈవో ఎస్‌.మురుగన్‌ మాట్లాడుతూ దేశంలో ఐరన్‌లోపం చాలా పెద్ద సమస్యగా మరిందని, దేశంలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి ఐరన్‌ లోపం ఉందన్నారు. అందుకు పరిష్కారం చూపేందుకు సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌హెచ్‌ఎఫ్‌పీఎల్‌) బృందం ఐస్ట్రాంగ్‌తో ముందుకు వచ్చిందన్నారు.

ప్రత్యేకంగా రూపొందించిన ఐరన్‌ ఫోర్టిఫైడ్‌ మహిళల ఆరోగ్య పానీయం, అనీమియాతో పోరాడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపారు. ఈ మల్టీగ్రెయిన్‌ ఆధారిత పానీయం 3 సూపర్‌ గ్రెయిన్స్‌ ఉసిరికాయ, క్వినోవా, బ్లాక్‌ రైస్‌తో సహా 8గింజలతో తయారు చేయబడిందన్నారు. 2 సర్వ్‌లలో 100శాతం ఆర్డీఏ ఐరన్‌, విటమిన్‌ సీ, విటమిన్‌ బీ9, బీ12 అందిస్తుంది. మిల్క్‌ ప్రోటీన్‌ యొక్క మంచిగుణాలతో పాటు ప్రోటీన్‌, డైటరీ ఫైబర్‌ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement