Sunday, October 13, 2024

Maharashtra | పుణే ఎయిర్‌పోర్టు పేరు మార్పు

మహారాష్ట్రలోని పుణే విమానాశ్రయం పేరు మార్పునకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఎయిర్‌ పోర్టు పేరును జగద్గురు తుకారామ్‌ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదానికి పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పుణకు చెందిన కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి మురళీధర్‌ మహోల్‌ ఈ ప్రతిపాదన చేయగా, శిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement