Monday, April 15, 2024

బ్యాంకుల్లో లాకర్‌ సేవలు మరింత ప్రియం

దేశ వ్యాప్తంగా బ్రాంచీలను కలిగిన ప్రముఖ బ్యాంకులు లాకర్‌ ఫీజులను భారీగా పెంచేశాయి. బ్యాంకు బ్రాంచీలు ఉన్న ప్రాంతం, లాకర్‌ సైజులను బట్టి ఫీజులను అధిక మొత్తంలో పెంచాయి. ఏటా కొంత మొత్తం చెల్లించడం ద్వారా కస్టమర్లు.. బ్యాంకుల్లో తమ విలువైన వస్తువులను, డాక్యుమెంట్లను లాకర్‌లలో భద్రపరుచుకునే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. కోవచ్చు. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పిఎన్‌బి, ఐసీఐసీఐ వంటి దిగ్గజ బ్యాంకులు లాకర్ల ఫీజులను భారీగా పెంచేశాయి. ఎస్‌బిఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బ్యాంకు బ్రాంచి ఉన్న ప్రదేశం, లాకర్‌ సైజులను బట్టి లాకర్‌ వార్షిక ఛార్జీలను రూ.500 నుంచి రూ.3వేల వరకు పెంచేసింది. మెట్రో, మెట్రో పాలిటన్‌ ప్రదేశాల్లో చిన్న, మధ్యతరహా, భారీ, అతిభారీ లాకర్‌ ఫీజులను వరుసగా రూ.2000, రూ.4000, రూ.8000, రూ12వేలుగా నిర్ణయించింది.

అదే సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో లాకర్ల ఛార్జీలను రూ.1500, రూ.3000, రూ.6000, రూ.9వేలుగా నిర్ణయించింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి విషయానికొస్తే, వార్షిక ఫీజులను రూ.3000 నుంచి 20 వేల మధ్య వసూలు చేయనుంది. మెట్రో, అర్బన్‌ ప్రదేశాల్లో స్మాల్‌ సైజ్‌ లాకర్‌కు రూ.3వేలు, మీడియం సైజు లాకర్లకు రూ.5వేలు, లార్జ్‌ సైజ్‌ లాకర్లకు రూ.10,000 చొప్పున చార్జీలను వసూలు చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంకు, స్మాల్‌ సైజ్‌ లాకర్లకు రూ.1,200 నుంచి రూ.5వేల వరకూ వార్షిక ఫీజులుగా వసూలు చేయనుంది. అతి భారీ లాకర్ల ఫీజులను రూ.10వేల నుంచి రూ.22వేలుగా నిర్ణయించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సైతం ఇతర బ్యాంకుల మార్గంలోనే నడిచింది. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ.1250- రూ.2000.. మెట్రో ప్రాంతాల్లో రూ.10వేల వరకు వసూలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement