Thursday, April 18, 2024

డిస్నీ- హాట్‌ స్టార్‌ కట్‌ చేసిన జియో

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో డిస్నీ-హాట్‌ స్టార్‌ తో కూడిన ప్రీ పెయిడ్‌ ప్లాన్లను తొలగించింది. డిస్నీ-హాట్‌స్టార్‌తో ఉన్న కొన్ని ప్రీ పెయిడ్‌ ప్లాన్స్‌ను జియో అక్టోబర్‌ నెలలో తొలగించింది. ఇప్పుడు 1499, 4199 ప్రీ పెయిడ్‌ ప్లాన్లలో ఉన్న డిస్నీ-హాట్‌స్టార్‌ ప్యాక్‌ను తాజాగా తొలగించింది. ఇప్పటికే ఈ ప్లాన్స్‌ను తీసుకున్న వారికి సర్వీస్‌ కొనసాగుతుందని జియో తెలిపింది.

డిస్నీ-హాట్‌స్టార్‌, అమెజాన్‌, ప్రైమ్‌ వీడియో, నెట్‌ప్లిక్స్‌ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్యాక్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కొనసాగిస్తున్నాయి. ఐపీఎల్‌ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వస్తున్న డిస్నీ హాట్‌ స్టార్‌ 2023 ప్రసార హక్కులను పొందలేకపోయింది. ఈ ప్రసార హక్కులను రిలయన్స్‌కే చెందిన వయాకామ్‌ 18 దక్కించుకుంది. అందువల్లే జియో డిస్నీ హాట్‌స్టార్‌ ప్యాక్‌ను తొలగించిందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement