Saturday, November 30, 2024

Layoff’s | బోయింగ్ లో ఉద్యోగుల తొలగింపులు

అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయిగ్‌ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సుమారు 17 వేల మంది ఉద్యోగులను తొలగించాలని బోయింగ్‌ నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్‌లో పని చేస్తున్న సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించిన సంస్థ , తొలగించే వారికి పింక్‌ స్లిప్పులు జారీ చేయడం ప్రారంభించింది.

తీవ్రమైన ఆర్ధిక ఒత్తిళ్లు, ఉత్పత్తి జాప్యం వంటి కారణాలతో సిబ్బందిని తొలగించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. సియాటెల్‌ ప్రాంతంలో 33 వేల మంది కార్మికుల కొన్నిఇ వారాల పాటు సమ్మె చేశారు. దీంతో 737 మాక్స్‌, 767, 777 జెట్‌ విమానాల తయారీ నిలిచిపోయింది.

సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చిందని బోయింగ్‌ ఇటీవల ప్రకటించింది. నష్టాలు తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 17 వేల మంది ఉద్యోగులకు ఇంటికి పంపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement