Friday, April 26, 2024

జియో సేమ్‌ డే ప్లాన్‌, ప్రతీ నెల ఒకే రోజు రీచార్జి.. 30 రోజుల కాలపరిమితి

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశాలను పాటిస్తూ.. రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు సరికొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. సరిగ్గా నెల రోజుల కాల వ్యవధి కలిగిన పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ట్రాయ్‌ సూచనను జియో అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 28 రోజుల కాల వ్యవధితో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని, దీంతో ఏడాదికి 13 సార్లు రీచార్జి చేయించుకోవాల్సి వస్తోందని, ఇకపై 12తోనే సరిపెట్టుకోవచ్చని ట్రాయ్‌ తెలిపింది. ప్రతీ నెల ఒకే తేదీన రిచార్జీ చేసుకునేలా ప్రతీ టెలికాం కంపెనీ.. కనీసం ఒక ప్లాన్‌ను అందుబాటులోకి తేవాలని ట్రాయ్‌ ఆదేశించింది. రెండు నెలల్లో అన్ని కంపెనీలు ఈ ఆదేశాలకనుగుణంగా.. 30 రోజుల కాల వ్యవధి కలిగిన ప్లాన్‌ తీసుకురావాలని డెడ్‌లైన్‌ విధించింది.

30 రోజుల వ్యాలిడిటీ
ట్రాయ్‌ ఆదేశాల మేరకు దేశంలో అతిపెద్ద టెలికాం రిలయ్స్‌ జియో ప్రీపెయిడ్‌.. తమ కస్టమర్ల కోసం 30 రోజుల ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో ప్రతీ నెల ఒకే తేదీ రోజున రీచార్జి చేసుకునే వీలుంటుంది. గతంలో 30 రోజుల ప్లాన్‌ను 28 రోజులకు తగ్గించాయి అన్నీ సంస్థలు.. తాజాగా మళ్లిd 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి టెలికాం కంపెనీగా జియో నిలిచింది. రూ.259తో రీచార్జి చేసుకుంటే.. 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ సహా ఇతర ప్రయోజనాలను ఈ కొత్త ప్లాన్‌లో జియో అందిస్తోంది. నెలలో ఉండే రోజులతో (30 లేదా 31) నిమిత్తం ఉండదు. ప్రతీ నెల ఒకేతేదీన రీఛార్జి చేయాల్సి ఉంటుంది. మార్చి 5న తొలి రీచార్జి చేస్తే.. తిరిగి ఏప్రిల్‌ 5, మే 5, జూన్‌ 5 అలా ప్రతీ నెల ఐదో తేదీన రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. అన్ని ప్లాన్‌ల తరహాలనే.. దీన్ని కూడా ఒకేసారి అనేక రీఛార్జులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాన్‌ అందరూ జియో వినియోగదారులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మాధ్యమంలో అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement