Friday, April 26, 2024

4జీ వేగంలో అగ్రగామి జియో..

రిలయన్స్‌ గ్రూపునకు చెందిన టెలికం కంపెనీ జియో మరోసారి సత్తా చాటింది. దేశీయ అత్యుత్తమ వేగవంతమైన సేవల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. 4జీ డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మేరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గురువారం నివేదిక విడుదల చేసింది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో జియో 4జీ డౌన్‌లోడ్‌ సగటు వేగం 19.1 ఎంబీపీఎస్‌ కాగా, అక్టోబర్‌లో ఇది 20.3 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అదే సమయంలో అక్టోబర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 15 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ ఐడియా 14.5 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ను కలిగివున్నట్లు పేర్కొంది. ఈ రెండింటితో పోల్చితే జియో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 5ఎంబీపీఎస్‌ అధికంగా ఉన్నట్లు తెలిపింది.

అప్‌లోడ్‌ వేగంలోనూ జియోనే అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌లో తొలిసారి మొదటి స్థానం దక్కించుకున్న జియో, అక్టోబర్‌లో ఆ స్థానాన్ని స్థిరపరుచుకుంది. 6.2 ఎంబీపీఎస్‌తో అప్‌లోడ్‌తో జియో మొదటి వరుసలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వొడాఫోన్‌ ఐడియా 4.5 ఎంబీపీఎస్‌తో రెండవ స్థానంలో కొనసాగుతున్నది. ఈ విషయంలో భారతీ ఎయిర్‌టెల్‌ మరింత దిగజారింది. కేవలం 2.7 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ను మాత్రమే కలిగివుంది. జియోతో పోలిస్తే సగానికంటే తక్కువ అప్‌లోడ్‌ స్పీడ్‌తో ఉండటం శోచనీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement