Monday, December 9, 2024

ఝున్ ఝున్ వాలాకి వారంలో రూ.753 కోట్లు న‌ష్టం

ప్ర‌భ‌న్యూస్ : బ్లాక్ ఫ్రైడే రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌ను భారీగా దెబ్బ‌కొట్టింది. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల మాదిరిగానే బిగ్ బుల్, దిగ్గ‌జ ఇన్వెస్ట‌ర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కూడా పెద్ద మొత్తంలో సంప‌ద కోల్పోయారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా ఫేవ‌రెట్ స్టాక్ టైటాన్ నిన్న ఒక్క రోజే దాదాపు 4.37 శాతం మేర ప‌త‌న‌మైంది. గ‌తవారంలో మొత్తం 7 శాతానికిపైగా క్షీణించింది. దీంతో ఒక్క వారంలోనే ఝున్ ఝున్ వాలా రూ.753 కోట్లు న‌ష్ట‌పోయారు. టైటాన్ కంపెనీ షేర్ ప్రైస్ డేటా ప్ర‌కారం.. నిన్న రూ.2374 నుంచి రూ.2,293 స్థాయికి ప‌డిపోయింది. అంటే ఇంట్రాడేలో ఒక్కోషేరుపై రూ.105 లేదా 4.40 శాతం మేర ఝున్ ఝున్ వాలా న‌ష్ట‌పోయారు.

ఇక వారం ప‌రంగా చూస్తే ఒక్కో షేరుపై రూ.174 లేదా దాదాపు 7 శాతం మేర న‌ష్ట‌పోయారు. టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్ర‌కారం.. జులై నుంచి సెప్టెంబ‌ర్ 2021 త్రైమాసికంలో రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయ‌న స‌తీమ‌ణి రేఖా ఝున్ ఝున్ వాలా టాటా గ్రూపున‌కు చెందిన టైటాన్ లో వాటాలు క‌లిగివున్నారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా 3,37,60,395 షేర్లు క‌లిగివున్నారు. కంపెనీ పెయిడ్ అప్ క్యాపిట‌ల్ లో ఇది 3.80 శాతంగా ఉంది. ఇక రేఖా ఝున్ ఝున్ వాలా 95,40,575 షేర్లు లేదా కంపెనీలో 1.07 వాటాను క‌లిగివున్నారు. ఇద్ద‌రూ ఉమ్మ‌డిగా 4.87 శాతం లేదా 4,33,00,970 వాటాల‌ను క‌లిగివున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement