Friday, April 19, 2024

బీమాకు పెరిగిన దీమా.. ఏప్రిల్‌లో 84 శాతం వృద్ధి

న్యూఢిల్లి : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల బిజినెస్‌ ప్రీమియం 2022, ఏప్రిల్‌లో భారీగా వృద్ధి చెందింది. కొత్త వ్యాపార ప్రీమియంలో 84 శాతం వృద్ధిని నమోదు చేసుకుని.. రూ.17,940 కోట్లకు చేరుకున్నాయి. ఎల్‌ఐసీ సాయంతో.. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 24 లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు.. రూ.9,739 కోట్లను కొత్త బిజినెస్‌ ప్రీమియంలో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో సేకరించాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే.. ఇన్సూరెన్స్‌ కంపెనీల ఆదాయం.. 84 శాతం పెరిగింది. ఈ మొత్తం కంపెనీల్లో.. టాప్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఉంది. 141 శాతం వృద్ధి సాధించింది. రూ.11,716 కోట్ల బిజినెస్‌ ప్రీమియం నమోదు చేసుకుంది. 2021, ఏప్రిల్‌లో కేవలం రూ.4,856.76 కోట్లుగా నమోదైంది.

గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 141 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తెలిపింది. ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసీ వాటా రికార్డు స్థాయిలో 65.31 శాతంగా ఉంది. మిగిలిన 23 కంపెనీలు.. 34.69 శాతం వాటాను కొనసాగిస్తున్నాయి. ఎల్‌ఐసీ మినహా మిగిలిన 23 కంపెనీల బిజినెస్‌ ప్రీమియంలో 27 శాతం వృద్ధి నమోదు చేసుకుని.. రూ.6,223 కోట్లకు చేరుకుంది. 2021లో 23 కంపెెనీల బిజినెస్‌ ప్రీమియం రూ.4,882 కోట్లుగా ఉంది. మొత్తం 24 సంస్థలకు సంబంధించిన పాలసీలు/స్కీంల పరంగా చూసుకుంటే.. ఏప్రిల్‌లో 32 శాతం పెరిగి.. 13,21,098 చేరుకున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ 31.92 శాతం వృద్ధి చెంది.. 9,13,141కు చేరుకున్నాయి. ఇక ప్రైవేటు కంపెనీలు.. 33.87 పెరిగి.. 3,04,748కు చేరుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement