Tuesday, April 23, 2024

పొదుపు పథకాల్లో 10 లక్షలు దాటితే.. ఆదాయ ధ్రువీకరణ అవసరం

పోస్టాఫీస్‌ పొదుపు పథకాల్లో సేవింగ్స్‌ 10 లక్షలు దాటితే ఆదాయ వనరులను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేవైసీ ప్రమాణాల్లో మార్పు చేస్తూ పోస్టల్‌ శాఖ ఒక సర్క్యూలర్‌ జారీ చేసింది. వీటితో పాటు అన్ని పోస్టాఫీస్‌ స్కీమ్స్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్‌, మనీ ల్యాండరింగ్‌ వంటి చట్ట విరుద్ధకార్యకలాపాలను నిరోదించేందుకే ఈ స్కీమ్స్‌లో కేవైసీ, పీఎంఎల్‌ఏ విధానాలను కఠినతరం చేసినట్లు తెలిపింది.

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో 10 లక్షల కంటే ఎక్కువ పొదుపు చేసిన వారి నుంచి ఆదాయాలకు సంబంధించిన రుజువులను తీసుకోవాల్సిందిగా అన్ని పోస్టాఫీస్‌లకు పోస్టల్‌ శాఖ ఆదేశించింది. ఎక్కువ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన వారి నుంచి అన్ని వివరాలు సేకరించాలని సూచించింది. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ), యాంటీ మనీ ల్యాండరింగ్‌ (ఎఎంఎల్‌), కాంబ్యాటింగ్‌ ది ఫైనాన్స్‌ ఆఫ్‌ టెర్రరిజం (సీఎఫ్‌టీ) ప్రమాణాలకు అనుగుంగా వీటిని అమలు చేస్తున్నట్లు సర్క్యులర్‌లో తెలిపింది. పోస్టాఫీసుల్లో పొదుపు చేస్తున్న వారిని మూడు కేటగిరిలుగా విభించాలని పోస్టల్‌ శాఖ నిర్ణయించింది.

- Advertisement -

పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచి పొదుపు పథకాల్లో 50 వేల వరకు పెట్టుబడి పెట్టేవారు. కాలవ్యవధి పూర్తయిన వాటి నుంచి డబ్బు విత్‌ డ్రా చేసేవారు. అన్ని స్కీమ్స్‌లో కలిసి ఇంతకు 50 వేలకు మించి వారందరినీ తక్కువ రిస్క్‌ ఉన్న కేటగిరిగా పరిగణిస్తారు. పోస్టాఫీస్‌లో ఖాతా ప్రారంభించి పొదుపు పథకాల్లో, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారి మొత్తం పెట్టుడులు 50 వేలకు పైగా 10 లక్షలకు లోపుగా ఉన్న ఖాతాదారుల అందరినీ మీడియా రిస్క్‌ ఉన్న కేటగిరిగా పరిగణించాలని నిర్ణయించారు.

పోస్టాఫీస్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు అన్ని కలిపి 10 లక్షలకు పైగా ఉన్న కస్టమర్లను ఎక్కువ రిస్క్‌ ఉన్న కేటగిరి కింద చూస్తారు. వీరి నుంచి ఆదాయానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, కుటుంబాలకు చెందిన ఖాతాదారులు, ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ రిస్క్‌ ఉన్న కేటగిరిలో ఉంటారు. వీరితో పాటు తరచుగా విదేశాలకు తిరుగుతున్న పలుకుబడి ఉన్నవారు, పాపులర్‌ వ్యక్తులు, కేంద్ర, రాష్ట్రాల అధిపతులు, సీనియర్‌ రాజకీయ నాయకుడు, సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్‌ న్యాయాధికారులు, సీనియర్‌ మిలటరీ అధికారులు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్‌ సీనియర్‌ అధికారులు, ప్రధానమైన రాజకీయ పార్టీల కార్యాలయాలు ఈ పరిధిలోకి వస్తాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈ కేటగిరిలో ఉన్న వ్యక్తులు పోస్టాఫీస్‌ పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడితో ఆదాయ వనరులకు సంబంధించి బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతా వివరాలు, మూడు సంవత్సరాల ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు, సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌ వంటి సర్టిఫికెట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

పోస్టాఫీస్‌లో ఖాతా ప్రారంభించి పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే ప్రతి కస్టమర్‌ ఇక నుంచి తప్పనిసరిగా ఫోటోతో పాటు ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్డులో ఉన్న అడ్రెస్‌, ప్రస్తుతం నివాసం ఉన్నదానికి భిన్నంగా ఉంటే ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, విద్యుత్‌ బిల్లు వంటి వాటిని సమర్పించాలని పోస్టల్‌ శాఖ కోరింది. లోరిస్క్‌, మీడియం రిస్క్‌ హై రిస్క్‌ కస్టమర్లు తప్పనిరిగా ప్రతి రెండు, 5, 7 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తనిఖీ చేయించుకోవాలని నిబంధన పెట్టింది. మెచ్యూరిటీ పొందేందకు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసిన పొదుపు ఖాతా ఉండాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement