Friday, October 4, 2024

Hyundai | దక్షిణాఫ్రికాకు హ్యుందయ్‌ ఎక్స్‌టర్‌..

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా తన ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ కార్లను దక్షిణాఫ్రికా మార్కెట్లలోకి ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఎగుమతులు ప్రారంభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌ నుంచి ద.ఆఫ్రికాకు ఎగుమతి అవుతున్న ఎనిమిదవ మోడల్‌ ఇదని పేర్కొంది.

హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా, మొదటి బ్యాచ్‌గా 996 ఎక్స్‌టర్‌ కార్లను ఎగుమతి చేసింది. ఇదివరకు గ్రాండ్‌ ఐ10, నియోస్‌, ఐ20, ఎన్‌ లైన్‌, వెన్యూ, వెన్యూ ఎస్‌లైన్‌ వంటి మోడళ్లను ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా కార్ల మార్కెట్‌లో హ్యుందయ్‌ సంస్థ టాప్‌ లీడర్‌గా ఉంది.

తమిళనాడు ప్లాంట్‌ల్రో ఉత్పత్తి చేసిన మోడళ్లను ద.ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుంటామని ఆ సంస్థ కార్పొరేటింగ్‌ ప్లానింగ్‌ హెడ్‌ జే వ్యాన్‌ తెలిపారు. ఇదిలావుండగా హ్యుందయ్‌ ఎక్స్‌టర్‌ ప్రారంభించిన తొలి ఏడాదిలోనే లక్ష యూనిట్లు విక్రయించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement